ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవాలంటే అతను చెలరేగాలి: బ్రెట్ లీ

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ విధ్వంసకరమైన ఆటగాడు.. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్. అతను నెలకొల్పిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముంబై ఇండియన్స్‌కు సారథిగా ఇప్పటికే నాలుగు టైటిళ్లు అందించాడు. కానీ ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఓ సీజన్ మొత్తం రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన దాఖలాలు లేవు. 2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఎలాంటి మెరుపులైతే మెరిపించాడో అలా రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఏ సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చలేదు.
కొన్ని సీజన్లలోనైతే హిట్ మ్యాన్ తన స్థాయికి తగ్గట్టు కూడా ఆడలేదు. కానీ అద్భుత కెప్టెన్సీతో జట్టుకు విజయాలందిస్తూ నెట్టుకొచ్చాడు. అయితే యూఏఈ వేదికగా జరుగుతున్న తాజా సీజన్‌లో రోహిత్ శర్మ టాపార్డర్‌లో మెరిస్తే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు.

రోహిత్ చెలరేగాలి..
స్టార్ స్పోర్ట్స్ ‘గేమ్ ప్లాన్'షోలో పాల్గొన్న బ్రెట్‌లీకి ముంబై ఇండియన్స్ టైటిల్ డిఫెండ్ చేసుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఎదురవ్వగా ఈ విధంగా బదులిచ్చాడు. రోహిత్ శర్మ ధాటైన ఇన్నింగ్స్‌లతో ముంబైకి మంచి ఆరంభాన్ని ఇవ్వాలని బ్రెట్ లీ సూచించాడు.‘ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ పరుగులు చేయడం చాలా ముఖ్యం. అతను గోప్ప కెప్టెన్ కావచ్చు. కానీ నాయకుడనేవాడు ముందుండి పరుగులు చేస్తూ జట్టుకు అండగా నిలవాలి. అప్పుడు ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తారు.

రోహిత్ ఒక్కడే..
జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్ళ కంటే రోహిత్ శర్మకు అనుభవం ఎక్కువ. యుఏఈ పరిస్థితులపై కూడా మంచి అవగాహన ఉంది. ఇక్కడ చాలా క్రికెట్ ఆడాడు. మంచి ప్రదర్శనలు కూడా చేశాడు. బ్యాటింగ్‌లో చెలరేగితే కెప్టెన్‌గా అతనిపై ఉన్న భారం కూడా తగ్గుతుంది. బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రాణిస్తే ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.'అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది..
ఇక డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబైకి ఈ సీజన్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉందని బ్రెట్ లీ అంచనా వేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు మంచి సమతూకంతో ఉందన్నాడు. ‘గతేడాది చాంపియన్ అయిన ముంబై జట్టు ఈ సీజన్‌లో కూడా మంచి సమతూకంతో ఉంది. పొలార్డ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎలా ఆడుతాడో తెలిసిందే. జస్ ప్రీత్ బుమ్రా కూడా టీ20ల్లో గొప్ప బౌలర్.. ఆ జట్టు మంచి స్పిన్ ఆప్షన్స్‌తో పాటు పవర్ హిట్టర్స్‌ను కలిగి ఉంది. ఇలా అన్ని విషయాల్లో పటిష్టంగా ఉన్న ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం.'అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications