Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Brendon McCullum: అందుకే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇష్టం.. కోహ్లీని చూసినప్పుడే అనుకున్నా!

Brendon McCullum: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని కెప్టెన్సీ చాలా బోల్డ్‌గా ఉంటుందని కొనియాడాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెండన్ మెక్‌కల్లమ్.. రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటు విరాట్ కోహ్లీ ఆట తీరును మెచ్చుకున్నాడు.

'రోహిత్ శర్మ కెప్టెన్సీ నాకెంతో ఇష్టం. అతను జట్టును నడిపించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి రిస్క్ తీసుకొనేందుకైనా సిద్ధంగా ఉంటాడు. గేమ్‌పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు మొగ్గు చూపుతాడు. ఇలాంటి ప్రతిభ చాలా అరుదుగానే ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో అతను గొప్ప ఫలితాలు సాధిస్తాడు. భారత జట్టునే కాకుండా ముంబై ఇండియన్స్‌ను కూడా రోహిత్ శర్మ అద్భుతంగా నడిపించాడు.

Brendon McCullum says Rohit Sharmas captaincy is bold, Virat Kohli was always a superstar

విరాట్ కోహ్లీని తొలిసారి చూసినప్పుడే అతను గొప్ప క్రికెటర్ అవుతాడని భావించాను. నేను ఆర్‌సీబీతో ఉన్నప్పుడు మేం ఇద్దరం కలిసి ఆడాం. ఆ తర్వాత ప్రత్యర్థులుగా తలపడ్డాం. క్రికెట్ పట్ల అతనికి ఉన్న పిచ్చి అమోఘం. భారీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన అసాధారణం. అభిమానుల కలలను నిజం చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తాడు. ఇది కోహ్లీ ఆట తీరును చూస్తేనే అర్థమవుతోంది. ఆటపై తనదైన ముద్ర వేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. ఆర్‌సీబీలో అతనే అత్యంత కీలకమైన ఆటగాడు. 'అని బ్రెండన్ మెక్‌కల్లమ్ చెప్పుకొచ్చాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని మెక్‌కల్లమ్ తెలిపాడు. టీమిండియాతో తమ జట్టుకు గట్టి సవాలే ఎదురవుతుందని, ఒత్తిడిని అధిగమించి తమదైన శైలిలో ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. బజ్‌బాల్ గేమ్ ఫలితాల గురించి తాము ఆలోచించడం లేదని, అత్యుత్తమ క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు.

Story first published: Wednesday, December 6, 2023, 18:43 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+