IPL 2021 Final: ఒక్కసారి ఆ ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకోండి! కేకేఆర్ కోచ్ స్పూర్తిదాయక మాటలు!

దుబాయ్: భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో రెండే విజయాలందుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో దుమ్మురేపింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో దసరా రోజున మరికొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా పోరును ఉద్దేశించి కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్.. ఆటగాళ్లలో స్పూర్తిని రగిల్చే వ్యాఖ్యలు చేశాడు. ఫస్టాఫ్‌లోని తమ జట్టు ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకొని కీలక ఫైనల్లో రాణించాలన్నాడు. మెక్ కల్లమ్‌కు స్పందించిన వీడియోను కేకేఆర్ ట్విటర్ వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది.
'ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలందుకున్నాం. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి నెమరువేసుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం టైటిల్ గెలవడమే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్‌మెంట్‌కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం'అని బ్రెండన్ మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.
తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు కూడా మెక్‌ల్లమ్ ప్రయత్నించాడు. సెకండాఫ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్.. ఏడింటిలో ఐదు గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. ప్లే ఆఫ్స్‌లో పటిష్ట ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించి పెవిలియన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications