For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరితో కోహ్లీకి సఖ్యత లేదు: ఆసీస్ మాజీ క్రికెటర్

ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెండన్ జులియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదని ఆరోపించాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సత్సంబంధాలు లేవన్నాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు 10 రోజుల ముందే అక్కడికి చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. పెర్త్‌కు సమీపంలోని వాకా మైదానంలో సాధన చేస్తోంది.

Brendon Julian says Virat Kohli is not gelling with captain Rohit and coach Gambhir

ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ మాజీ ఆటగాళ్లు తమ మాటలతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. భారత ఆటగాళ్లనే లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బ్రెండన్ జులియన్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ విఫలమైన విధానం నమ్మశక్యంగా లేదు. ఈ సిరీస్‌లో కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. అతను కెప్టెన్, కోచ్‌తో సరిగ్గా ఉండటం లేదు. పెర్త్‌లోనూ బంతి టర్న్ అయితే విరాట్ కోహ్లీ తన వైఫల్యాన్ని కొనసాగిస్తాడనుకుంటున్నా. నాథన్ లయన్ లేదా ఇతర స్పిన్నర్ల బౌలింగ్‌లో వెనుదిరుగుతాడనిపిస్తోంది.

తొలి టెస్ట్‌ను ఆసీస్ 4 రోజుల్లోనే ముగిస్తోంది. టీమిండియాకు చాలా బలహీనతలున్నాయి. రోహిత్ శర్మ తొలి టెస్ట్ ఆడటం లేదు. కాబట్టి బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఓపెనింగ్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అతనిపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. అయితే అతను అద్భుతమైన బౌలర్. కానీ కెప్టెన్సీతో పాటు ఓపెనింగ్ బౌలర్‌గా ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టం.'అని బ్రెండన్ జులియన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 14, 2024, 18:13 [IST]
Other articles published on Nov 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+