Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అన్ని జట్ల కంటే SRH బాగుంది: బ్రాడ్ హగ్

ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రాడ్ హగ్ 10 జట్లకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ తుది జట్టును కలిగిన జట్టుతో పాటు చెత్త టీమ్ వివరాలను వెల్లడించాడు.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా 10 జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి ఓ రీల్ క్రియేట్ చేశాడు. ఆన్‌ పేపర్‌పై 10 జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అత్యుత్తమంగా ఉందని చెప్పాడు. సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ పవర్‌ఫుల్‌గా ఉందని తెలిపాడు. మెగా వేలంలో మెరుగైన ఆటగాళ్లను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిందని కితాబిచ్చాడు.

Brad Hogg Says SRH Has Got The Best Squad In IPL 2025 Mega Auction

'10 జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బెస్ట్. ఆ జట్టులో పవర్ ఫుల్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ఉంది. రెండో అత్యుత్తమ జట్టు ముంబై ఇండియన్స్. ముంబైలో క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్‌తో పాటు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్‌లు ఉండటం అదనపు బలం. మూడో అత్యుత్తమ జట్టు లక్నో సూపర్ జెయింట్స్. లక్నోలో క్వాలిటీ ఇండియన్ బౌలింగ్ లైనప్‌తో పాటు సాలిడ్ బ్యాటింగ్ ఉంది. నాలుగో అత్యుత్తమ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు మరోసారి బిగ్ ప్లేయర్ల జోలికి పోకుండా కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది. క్రమశిక్షణ కలిగిన ఆటగాళ్లు సీఎస్‌కేలో ఉన్నారు.

ఐదో అత్యుత్తమ జట్టు ఆర్‌సీబీ. ఆ జట్టుకు నాణ్యమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ ఉంది. కానీ ఇద్దరు బ్యాటర్లు తక్కువగా ఉన్నారు.సమష్టిగా రాణిస్తే ఆర్‌సీబీకి తిరుగుండదు. ఆరో అత్యుత్తమ జట్టు గుజరాత్ టైటాన్స్. ఆ జట్టుకు క్వాలిటీ బౌలింగ్ లైనప్ ఉంది. కానీ మిడిలార్డర్‌లో పవర్‌ఫుల్ బ్యాటర్లు లేరు. ఈ బలహీనతం ఆ జట్టు భారీ స్కోర్లకు అడ్డంకిగా మారనుంది. ఏడో అత్యుత్తమ జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆ జట్టులో నాణ్యమైన బౌలింగ్‌తో పాటు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఓ స్పిన్నర్‌తో పాటు మూడో పేసర్ కొరత ఉంది. అందుకే ఆ జట్టుకు నేను ఏడో ర్యాంక్ ఇచ్చాను.

ఎనిమిదో అత్యుత్తమ జట్టు కేకేఆర్. ఆ జట్టులో క్వాలిటీ బ్యాటర్లు లేరు. ఆల్‌రౌండర్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే కేకేఆర్‌కు 8వ ర్యాంకు ఇచ్చాను. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు టాపార్డర్‌లో కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఉన్నారు. వారిపై నమ్మకం ఉంచలేని పరిస్థితి. అందుకే ఆ జట్టుకు 9వ ర్యాంక్ ఇచ్చాను. బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్న పంజాబ్ కింగ్స్‌‌కు లాస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను.'అని బ్రాడ్ హక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 26, 2024, 22:40 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+