Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni చెన్నై సూపర్ కింగ్స్ ‘మహారాజు’: బ్రాడ్ హగ్

Brad Hogg Says MS Dhoni Is Maharaja of CSK, he will become coach if the franchise doesn’t retain him in 2022

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఆ ఫ్రాంఛైజీ 'మహారాజు'అని, ఆ జట్టును అతను వదలడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ తెలిపాడు. ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ భారత క్రికెట్‌ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ ఆసీస్ స్టార్ ఇలా బదులిచ్చాడు.
'బ్రాడ్‌ సర్‌.. ఒకవేళ ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో చెన్నై జట్టు ధోనీని రిటైన్ చేసుకోకపోతే ఏ జట్టు అతని అనుభవం, సేవలను పొందాలని చూస్తుంది'అని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.
దానికి స్పందించిన బ్రాడ్‌హాగ్‌.. 'ఐపీఎల్‌లో ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వదలడు. ఆ ఫ్రాంఛైజీకి అతను మహారాజు. ఒకవేళ ధోనీని ఆటగాడిగా కొనసాగించకపోతే కోచింగ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు'అని సమాధానమిచ్చాడు.

ఇక ఐపీఎల్ 2022 సీజన్‌కు బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుందని, డిసెంబర్‌లో భారీ వేలం నిర్వహించే అవకాశం ఉందని రాసుకొచ్చింది. అంతేకాకుండా 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు కూడా పిలవనుందని పేర్కొంది. ఇక మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై బీసీసీఐ స్పష్టతనిచ్చిందని తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 2022 సీజన్‌ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని రీటెయిన్‌ చేసుకోవచ్చు. ఇందులో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు. లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. కాగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు, ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.

ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచింది. అంటే పది ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. పది జట్లతో నిర్వహించే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని అంచనా. ఎందుకంటే ఎనిమిది జట్లతో 60 మ్యాచులే నిర్వహిస్తున్నారు. అదే పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు ఉంటాయి. దాంతో 25 శాతం ఎక్కువ ధర లభిస్తుందని బ్రాడ్‌కాస్ట్ వర్గాల అంచనా.

Story first published: Monday, July 5, 2021, 20:49 [IST]
Other articles published on Jul 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+