For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brad Hogg: భారత్ చేతిలో ఓడితే పాకిస్తాన్ ఫసక్! సెమీస్ చేరే జట్లు అవే!

Brad Hogg says If Pakistan lose to India, they wont go through in World Cup 2021

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైతే ఆ జట్టు కథ ముగిసినట్లేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. అంతేకాకుండా మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరే జట్లను అంచనా వేశాడు. ఇక ఆదివారం దాయాది దేశాల మధ్య రసవత్తర పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ ఫైట్ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో టీమిండియా ఆటగాళ్లు రాణించడంతో పాటు వామప్‌ మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టడంతో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. ఈ మెగా మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన బ్రాడ్ హగ్.. భారత్ జట్టు సెమీఫైనల్ చేరుతుందని అంచాన వేశాడు. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పేర్లను, గ్రూప్‌-2 నుంచి భారత్‌, పాకిస్థాన్‌ పేర్లను బ్రాడ్ హగ్ సూచించాడు. అయితే, తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టీమింయా చేతిలో ఓటమిపాలైతే మాత్రం తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలవాల్సి ఉంటుందన్నాడు. ఆ మ్యాచే దాయాది జట్టు సెమీస్‌కు చేరుతుందా లేదా అనేది నిర్ణయిస్తుందని తెలిపాడు. టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆధిపత్యం చలాయిస్తే పాక్‌ తర్వాతి మ్యాచ్‌ల్లో రాణించడం కష్టమని హాగ్‌ అభిప్రాయపడ్డాడు.

'భారత్ చేతిలో పాక్ ఓడితే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. తరువాతి మ్యాచ్‌లో పాక్.. న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచే ఆ జట్టు భవితవ్యాన్నితేల్చుతుంది. అయితే భారత్‌ను ఓడిస్తే మాత్రం పాక్‌కు తిరుగుండదు. ఓడితే మాత్రం పాక్‌ ముందంజ వేయలేదనేది నా అభిప్రాయం. ఏం జరుగుతుందో చూద్దాం. నా అంచనా ప్రకారం గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సెమీస్ చేరితే.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.'అని హగ్ చెప్పుకొచ్చాడు.

కాగా, గ్రూప్‌-2లో ఉన్న భారత్‌, పాక్‌ జట్లు సూపర్‌-12 దశలో న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌తో పాటు గ్రూప్‌-ఏ రన్నరప్‌, గ్రూప్‌-బి విజేతలతో మిగతా మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే టీమ్ మొత్తం మ్యాచ్ విన్నర్లున్న టీమిండియా అన్ని జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది.

Story first published: Friday, October 22, 2021, 14:16 [IST]
Other articles published on Oct 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+