
పునరాగమనం కష్టమే
బ్రాడ్ హాగ్ సోమవారం తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతుండగా.. సురేష్ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్ అభిమాని ప్రశ్నించాడు. 'ప్రస్తుతం టీమిండియాను చూస్తే.. యువకులను ప్రోత్సహించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకుంటున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. మరి సురేష్ రైనాకు స్థానం ఎక్కడ ఉంటుంది. రైనా లోయర్ ఆర్డల్ ఆడడం నేనెప్పుడూ చూడలేదు. మూడు, నాలుగో స్థానంలో ఆడగలిగే బ్యాట్స్‌మన్ రైనా. ఇక అతడికి భారత జట్టులో స్థానం దక్కే అవకాశాలు నాకు అస్సలు కనిపిచడం లేదు. జట్టులో రీఎంట్రీపై ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందే' అని బ్రాడ్ హాగ్ సమాధానం ఇచ్చాడు.

ధావన్‌ను రిజర్వ్ బెంచ్‌లో ఉంచితే
ఒకవేళ టీ20 ఫార్మాట్‌లో సురేష్ రైనా అవకాశం కోసం యత్నిస్తే.. అప్పుడు శిఖర్ ధావన్‌ను రిజర్వ్ బెంచ్‌లో ఉండాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడ కూడా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఓపెనింగ్ చేసి.. ధావన్ జట్టులో లేని పక్షంలోనే రైనాకు అవకాశం వచ్చే చాన్స్ ఉంటుందన్నాడు. అయితే అది జరగడం అనేది ప‍్రస్తుతం పరిస్థితుల్లో లేదని హాగ్ అభిప్రాయపడ్డాడు. ఏ రకంగా చూసుకున్నా రైనా తిరిగి భారత జట్టులోకి వచ్చేందకు దారులు మూసుకుపోయాయన్నాడు.

ప్రపంచకప్‌లో ఆడతా
తన రీఎంట్రీపై సురేష్ రైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన పునరాగమనం తప్పనిసరిగా ఉంటుందనే ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే రైనా.. ఆ లీగ్‌లో సత్తాచాటితే భారత జట్టులో చాన్స్‌ను పట్టేయవచ్చనే ఆశతో ఉన్నాడు. తాను టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే ఆశలు ఐపీఎల్‌పైనే ఆధారపడి ఉన్నాయన్న రైనా.. తనకు ఇంకా రెండు-మూడేళ్ల క్రికెట్ మిగిలే ఉందన్నాడు. రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో తాను ఆడతానని చెప్పుకొచ్చిన రైనా.. తన టీ20 క్రికెట్ ఎంతో మెరుగ్గా ఉందన్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు.

రైనా ఆశలపై నీళ్లు
గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇక లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో రైనా పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఈ సీనియర్ క్రికెటర్ ఆశించాడు. కానీ కరోనా అతని ఆశలపై నీళ్లు చల్లింది. ప్రపంచకప్ వాయిదా పడింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ జరగడం అతడికి కాస్త ఉపశమనం కలిగించే అంశం.


Click it and Unblock the Notifications

యువ పేసర్‌పై రెండేళ్ల నిషేధం!!