
సచిన్‌తో పోలికా..?
అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సచిన్ టెండూల్కర్(100) తర్వాతి స్థానంలో నిలిచాడు. దాంతో మరోసారి కోహ్లీని సచిన్‌తో పోల్చుతున్నారు. 100 సెంచరీల రికార్డును కోహ్లీనే అధిగమిస్తాడని జోస్యం చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ మాత్రం సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా.. ఈ ఇద్దరిని పోల్చడం భావ్యం కాదన్నాడు. గత మూడేళ్లుగా కోహ్లీ చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడని తెలిపాడు. కరోనా, పేలవ ఫామ్, కెప్టెన్సీ కోల్పోవడం, బిజీ షెడ్యూల్‌తో ఉక్కిరి బిక్కిరయ్యాడని చెప్పుకొచ్చాడు.

మూడేళ్లు ఇబ్బంది పడ్డాడు..
'అదృష్టవశాత్తు మనం మళ్లీ పాత కోహ్లీని చూశాం. గత 2-3 ఏళ్లుగా అతను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. కరోనా, కెప్టెన్సీ, తీరికలేని షెడ్యూల్‌తో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీని పోల్చవద్దు. ఎందుకంటే సచిన్ తన కెరీర్‌లో ఎక్కువగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ కూడా ఎక్కువగా ఆడింది లేదు. మరోవైపు కోహ్లీ మాత్రం టెస్ట్‌లు తక్కువగా ఆడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడుతున్నాడు. అందులో ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కోహ్లీ సత్తా చాటుతాడనిపిస్తోంది.'అని బ్రాడ్ హగ్ తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 3 నెలలా?
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్‌పై బ్రాడ్ హగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్‌కు మూడు నెలలు వేచి చూడాలా? అని ఐసీసీని నిలదీసాడు. 'అసలు ఐసీసీ ఏం చేస్తోంది. చాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌లన్నీ ముగిసినా.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మూడు నెలల వేచి చూడటం ఎందుకు? ఇది ఏ మాత్రం భావ్యం కాదు. దయచేసి ఐసీసీ మేల్కొనాలి. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా.. ఫైనల్ చూడాలనే ఉత్సాహం, ఊపు తగ్గిపోతుంది. ఆ మూమెంటమ్ మిస్సవుతోంది.

తటస్థ వేదిక ఎందుకు..?
ఐపీఎల్ తర్వాత ఫైనల్ నిర్వహించడం వల్ల అభిమానులు అంతగా ఆసక్తి చూపరు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూసిన అభిమానులకు డబ్ల్యూటీసీ ఫైనల్ బోర్ కొడుతోంది. తటస్థ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడం కూడా సరికాదు. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన ఆతిథ్య హక్కులు ఇవ్వాలి.'అని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












