రిషభ్ పంత్‌ను గెలకొద్దు.. రాహుల్ ద్రవిడ్‌కు ఆసీస్ స్పిన్నర్ అడ్వైజ్!

సిడ్నీ: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను గెలకొద్దని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ సూచించాడు. ప్రస్తుతం అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, బ్యాటింగ్ టెక్నింగ్ గురించి మాట్లాడకుండా కాస్త భరోసా కల్పిస్తే చెలరేగి ఆడతాడని తెలిపాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్ పంత్ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 8, 34, 17, 0, 27 ఒక్కదాంట్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక రెండో టెస్ట్‌లో నిర్లక్ష్యపు షాట్‌తో డకౌట్‌గా వెనుదిరిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

భరోసా కల్పించాలి..
ఈ క్రమంలోనే షాట్ సెలెక్షన్ గురించి రిషభ్ పంత్‌తో చర్చిస్తామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అయితే అతని బ్యాటింగ్ టెక్నిక్ జోలికి పోకుండా భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు బ్రాడ్ హగ్ సూచించాడు. 'రిషభ్ పంత్ నాణ్యమైన ఆటగాడే. కానీ, ఇటీవల తరచూ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం చిరాకు తెప్పిస్తోంది. జొహన్నెస్ బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్ బాట పట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ అలా ఔట్ కావడం విమర్శలకు తావిచ్చింది.

టెక్నిక్ మార్చుకోవాల్సిన..
ఒత్తిడిలో కూడా మెరుగ్గా రాణించగల నైపుణ్యం పంత్‌లో ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా మైదానంలో జరిగిన టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కానీ, సౌతాఫ్రికా పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. పంత్ లోపాల్ని అధిగమించి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. షాట్ సెలెక్షన్ గురించి పంత్‌తో చర్చిస్తామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. బ్యాటింగ్ టెక్నిక్ గురించి, వ్యూహాల గురించి అతడితో చర్చించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ప్రస్తుతం పంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మానసికంగా కొంచెం ధైర్యం అందించి.. నీ వెంట మేమున్నామనే భరోసా కల్పిస్తే అతను చెలరేగి ఆడతాడు' అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.

నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా..
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతుంది. కీగన్ పీటర్సన్(56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో భారత బౌలర్ల సత్తాను పరీక్షిస్తున్నాడు. అతనికి అండగా బవుమా(16 బ్యాటింగ్) నిలవడంతో 48 ఓవర్లు ముగిసేసరికి సఫరీ టీమ్ 4 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications