Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గెలిచే ఏకైక అవకాశం పోయింది.. ఇక టీమిండియా పుంజుకోవడం కష్టం'

Brad Haddin says Team India Wont recover from defeat in Adelaide test
Ind vs Aus 2020 : India will not recover from defeat in Adelaide Test, says Brad Haddin

మెల్‌బోర్న్‌: గెలవడానికి అడిలైడ్‌ టెస్టు భారత్‌కు మంచి అవకాశమని, అందులోనే ఓడిపోయిన కోహ్లీసేన టెస్టు సిరీస్‌లో పుంజుకోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ వికెట్ ‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లీసేన లోపాలు బయటపడ్డాయి. ఇక పెటర్నిటీ లీవ్ మీద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు రానుండగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును నడిపించనున్నాడు. తొలి టెస్ట్ ఓడిన టీమిండియాకు కోహ్లీ కూడా లేకపోవం లోటే.

ఏకైక అవకాశం అడిలైడ్‌

ఏకైక అవకాశం అడిలైడ్‌

తాజాగా బ్రాడ్‌ హడిన్‌ మాట్లాడుతూ... 'ఈ పరాజయం (డే/నైట్ టెస్ట్) నుంచి భారత్‌ కోలుకోగలదని నేను అనుకోను. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్‌ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. పరుగులు కూడా బాగానే చేశారని అనుకున్నా. సిరీస్‌లో భారత్‌ ఇక పుంజుకుంటుందని అనుకోను' అని చెప్పాడు. హడిన్‌ ఆసీస్ తరఫున 66 టెస్టులు, 126 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 6 శతకాలు బాదాడు.

టీమిండియా పుంజుకోవడం కష్టం

టీమిండియా పుంజుకోవడం కష్టం

'మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి బ్రిస్బేన్‌లో జరగాల్సివుంది. అక్కడ ఎవరూ ఆసీస్‌ను ఓడించలేరు. వచ్చే రెండు టెస్టుల్లో పిచ్‌ భారత క్రికెట్‌కు సరిపోతుంది. కానీ ఆ జట్టు పుంజుకోవడం కష్టం. కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్‌కు గొప్ప బౌలింగ్‌ దళం ఉంది. ఇప్పుడు సీనియర్ ఇషాంత్ శర్మ లేడు. మొహ్మద్ షమీ గాయంతో దూరమయ్యాడు. షమీ స్థానాన్ని భర్తీ చేసే బౌలింగ్‌ వనరులు భారత్‌కు లేవు' అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ ‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్ అన్నాడు.

మెల్‌బోర్న్‌ మ్యాచ్‌కు పకడ్బందీగా భారత్‌

మెల్‌బోర్న్‌ మ్యాచ్‌కు పకడ్బందీగా భారత్‌

తొలి టెస్టులో ఘోర పరాజయంతో మెల్‌బోర్న్‌ మ్యాచ్‌కు భారత్‌ పకడ్బందీగా బరిలోకి దిగాలనుకుంటోంది. రెండో టెస్టులో భారీ మార్పులు ఖాయం అయ్యాయి. తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి స్థానం గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. గాయం కారణంగా జడ్డూ గులాబీ టెస్టుకు దూరమయ్యాడు. ఒకవేళ అతను ఫిట్‌గా ఉంటే తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వేగంగా కోలుకుంటున్న జడేజా కొద్ది రోజులుగా నెట్స్‌లోనూ కనిపిస్తున్నాడు. గాయం కారణంగా పేసర్‌ షమీ సిరీస్‌కు దూరం కావడంతో జడేజాను తీసుకుంటే అదనపు బౌలర్‌గానూ వినియోగించుకోవచ్చని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది.

ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు

ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు

టీమిండియా అడిలైడ్‌ ఓవల్‌లో సోమవారం సాధన చేయలేదు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేశారు. సారథి విరాట్‌ కోహ్లీ మంగళవారం స్వదేశానికి బయల్దేరుతున్నాడు. ఈ సందర్భంగా అతడు జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. మిగతా సిరీసులో జోరు పెంచడంపై చర్చించాడని తెలిసింది. ఇక సిడ్నీ టెస్టుకు ముందు రోహిత్‌ శర్మ సాధన మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు సిడ్నీలోని రెండు గదుల భవంతిలో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్‌ అయ్యాడు.

26, 30, 36, 45, 47: టెస్టు చరిత్రలో అత్య‌ల్ప స్కోర్లు!! ఏ జట్టు స్కోరు ఎంతో తెలుసా?

Story first published: Tuesday, December 22, 2020, 8:13 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+