BPL 2022 ఫైనల్లో దుమ్మురేపిన సునీల్ నరైన్.. మురిసిపోతున్న కేకేఆర్!

ఢాకా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ హిట్టర్ సునీల్ నరైన్ మరోసారి దుమ్మురేపాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఫైనల్లో ఈ విండీస్ వీరుడు రెచ్చిపోయాడు. మరో విధ్వంసకర హాఫ్ సెంచరీతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న కోమిల్లా విక్టోరియన్స్ టీమ్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే సునీల్ నరైన్ సూపర్ ఫామ్ కనబర్చడంతో కేకేఆర్ ఫ్రాంచైజీ తెగ సంతోషపడుతుంది.
మళ్లీ కొట్టేసాడు..
శుక్రవారం జరిగిన బీపీఎల్ ఫైనల్లో.. నరైన్ టీమ్ కోమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఒక్క పరుగు తేడాతో ఫార్చూన్ బారిషల్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన నరైన్ ( 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57) దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. దీంతో ఈ లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితం అయింది.

నరైన్ హిట్టింగ్...
అనంతరం బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేసి ఓటమిపాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో నరైన్ ఆటనే హైలైట్‌గా నిలిచింది. అతను క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్సర్లతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం నరైన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

యువీ రికార్డు జస్ట్ మిస్..
గత బుధవారం చట్టోగ్రామ్ టీమ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లోనూ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డును తృటిలో మిస్సయ్యాడు. యువరాజ్ సింగ్, విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్, అఫ్గాన్ ప్లేయర్ హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా.. మార్కోస్ ట్రెస్కోతిక్, సునీల్ నరైన్ 13 బంతుల్లో ఈ ఘనతను సాధించారు. టీ20 క్రికెట్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన బ్యాట్స్‌మన్ జాబితాలో నరైన్ ఐదో స్థానంలో నిలిచాడు.

సంతోషంలో కేకేఆర్..
నరైన్ ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చెలరేగడంతో కేకేఆర్ ఫ్రాంఛైజీ తెగ సంతోషంపడుతుంది. ఆ జట్టులో ఎంతో కాలంగా కీలక ఆటగాడిగా కొనసాగుతున్న నరైన్ 2012, 2014 సీజన్లలో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది మెగా వేలానికి ముందు అతన్ని కేకేఆర్ రూ.6 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అతనుగనుక వేలంలోకి వచ్చి ఉంటే రూ 10 కోట్లు పలికేవాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ నరైన్ తమ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే ఆశతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications