
హైదరాబాద్: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఇంటర్నేషన్‌ల్ స్టార్ క్రికెటర్లంతా ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇమిటేట్ చేసేంత. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని 'నీ అవ్వ తగ్గేదేలే' డైలాగ్, ఊ అంటావా మామ, శ్రీవల్లీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డైలాగ్, పాటలను ఇమిటేట్ చేయగా.. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా తదితరులు కూడా నీ అవ్వ తగ్గేదేలే డైలాగ్‌తో రచ్చ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన పుష్ప క్రేజ్.. ఇప్పుడు క్రికెట్ మైదానానికి కూడా చేరింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో 'నీ అవ్వ తగ్గేదేలే'అనే అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బీబీఎల్‌లో జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అమిత్ హసన్ ఊరించే బంతితో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించాడు. ఎక్స్‌ట్రా కవర్ దిశగా బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌ను ఫీల్డర్ పరుగెత్తి అద్బుతంగా అందుకున్నాడు. దాంతో అమిత్ హసన్ అల్లు అర్జున్ డైలాగ్ తగ్గేదే లే డైలాగ్‌కు సంబంధించిన మేనరిజాన్నీ ప్రదర్శించాడు. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు.
ఇటీవల పుష్ప సినిమా చూసిన సురేశ్ రైనా.. అందులోని శ్రీవల్లి పాటకు పుష్ప రాజ్‌గా స్టెప్పులేసి అదరగొట్టాడు. అచ్చం అల్లు అర్జున్ మాదిరిగానే స్టెప్పులేశాడు. అల్లు అర్జున్ మాదిరిగానే చెప్పులు, కళ్లజోడు ధరించి ఆకట్టుకున్నాడు. ఈ వీడియాలో రైనాతోపాటు మరో ఇద్దరు కూడా స్టెప్పులేసారు. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న రైనా.. 'ఈ పాటను చూసి స్టెప్పులేయకుండా ఆగలేకపోయాను. అందుకే ఇలా ప్రయత్నించాను. అల్లు అర్జున్ బ్రదర్.. పుష్పలో ఏం నటించావు.. అదరగొట్టేసావు. కెరీర్‌లో ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలి బ్రో'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.