
భారత్ ఒత్తిడి లేదు:
'పాకిస్థాన్‌లో పర్యటించకుండా శ్రీలంక ఆటగాళ్లపై భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదు. భారత్ హస్తం ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 2009 ఉగ్రదాడి కారణంగానే లంక జట్టులోని కొందరు ఆటగాళ్లు అక్కడకు వెళ్లోద్దని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు క్రికెటర్లు భయపడుతున్నారు. ఆటగాళ్లు అందరూ తమ అభిప్రాయలను తెలిపారు. వారి అభిప్రాయలను గౌరవించి అక్కడ పర్యటించేందుకు ఆసక్తి ఉన్నవారినే ఎంపిక చేశాం. ఇప్పటికీ మాది పటిష్ఠమైన జట్టు. పాక్‌ను వారి గడ్డపై ఓడిస్తామన్న నమ్మకం ఉంది' అని ఫెర్నాండో ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.

10 మంది ఆటగాళ్ల నిరాకరణ:
సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ టూర్ షెడ్యూల్ చేయబడింది. ఈ పర్యటన నేపథ్యంలో లంక బోర్డు సోమవారం ఆటగాళ్లతో సమావేశం అయింది. లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. వీరితో పాటు 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించారు. ఇదే విషయాన్ని లంక బోర్డు పీసీబీకి తెలిపింది.

లంక ఆటగాళ్లను భారత్ బెదిరించింది:
పాక్ టూర్‌ను లంక ఆటగాళ్లు బహిష్కరించడానికి కారణం భారతే అని ఫవాద్ హుస్సేన్ సంచలన ఆరోపణలు చేసాడు. 'పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకించకపోతే ఐపీఎల్‌లో ఆడనివ్వమని శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరించినట్టు మ్యాచ్ కామెంటేటర్లు కొందరు నాకు చెప్పారు. ఇది సరైన పద్దతి కాదు. ఇది నిజంగా ఉన్మాద చర్య. భారత్ చౌకబారు బెదిరింపులను మనమంతా తీవ్రంగా ఖండించాలి' అని ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశాడు. తాజాగా ఫెర్నాండో స్పందించి ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.


Click it and Unblock the Notifications












