Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూయార్క్ ఫ్యాష‌న్ వీక్‌.. ర్యాంప్‌పై కూతురుతో మెరిసిన సెరీనా!!

Serena Williams and Her Daughter Alexis Olympia Rocks the Runway at New York Fashion Week

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశకు గురైన అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి త్వరగానే కోలుకుంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం మూడు రోజుల తరువాత సెరెనా విలియమ్స్ న్యూయార్క్ ఫ్యాష‌న్ వీక్‌లో త‌ళుక్కున మెరిసింది. సెరెనా త‌న రెండేళ్ల కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహ‌నియ‌న్ జూనియ‌ర్‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేసింది. దీంతో ఒలంపియా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో అరంగేట్రం చేసింది.

న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ వెస్ట్‌లో సెరీనా క‌లెక్ష‌న్ పేరుతో రిలీజైన డ్రెస్సుల‌ను సెరీనా తన కూతురితో కలిసి ఈ షోలో ప్రెజంట్ చేసింది. ఈ షోకి టాప్ సెల‌బ్రిటీలు కిమ్ క‌ర్దాషిన్‌, లాలా ఆందోనీ, ఆష్లే గ్ర‌హ‌మ్‌, గేల్ కింగ్, అన్నా వింటౌర్, డాశ్చా పొలంకోలు హాజ‌ర‌య్యారు. సెరెనా న్యూయార్క్ ఫ్యాష‌న్‌లో త‌నదైన స్ట‌యిల్‌లో అంద‌ర్నీ అట్రాక్ట్ చేసింది. మేఘన్ మార్క్లే, ప్రియాంక చోప్రా జోనాస్, నటాషా బేడింగ్‌ ఫీల్డ్ మరియు జిగి హడిడ్ వంటి ప్రముఖులు ఆమెను ఉత్సాహపరిచారు.

యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కెనడా టీనేజర్ బియాంక ఆండ్రెస్కు 6-3, 7-5 తేడాతో సెరెనాను చిత్తుగా ఓడించింది. రికార్డు స్థాయిలో పదోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు వచ్చిన సెరెనా విలియమ్స్‌ను తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న బియాంక మట్టికరిపించింది. ఈ ఓటమితో టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక టైటిళ్లు (24) సాధించాలనుకున్న 37 ఏళ్ల సెరెనా విలియమ్స్‌ కలను బియాంకా ఆండ్రిస్కూ అడ్డుకుంది.

Story first published: Wednesday, September 11, 2019, 16:14 [IST]
Other articles published on Sep 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+