For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: జడేజా.. నువ్ తోపు‌!! గిల్ తోసేసినా పట్టేశావుగా (వీడియో)

Boxing Day Test: Ravindra Jadeja takes brilliant Catch despite collision with Shubman Gill
#INDVSAUSTest: Ravindra Jadeja Takes a Brilliant Catch After Collision with Shubman Gill

మెల్‌బోర్న్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు భారత్ ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ‌ తర్వాత బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. శనివారం ఆట పూర్తయ్యే సమయానికి వికెట్‌ నష్టపోయి 36 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ ‌(28; 38 బంతుల్లో 5x4), ఛెతేశ్వర్‌ పుజారా (7; 23 బంతుల్లో 1x4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 11 ఓవర్లకు 36/1తో నిలిచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది.

ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ:

ఈ మ్యాచులో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 10 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ జో బర్న్స్ ‌(0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. జట్టు స్కోర్‌ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్ ‌(30) ఔటయ్యాడు. ఆర్ అశ్విన్‌ వేసిన 12.5 ఓవర్‌కు అతడు షాట్‌ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన జడేజా ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ సైతం క్యాచ్‌ పట్టడానికి వచ్చాడు. జడ్డూ వద్దని సైగ చేసినా.. గిల్ పట్టించుకోలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ.. జడ్డూ ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు.

 జడేజా.. నువ్ తోపు:

జడేజా.. నువ్ తోపు:

ఈ క్యాచ్ ద్వారా టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. రవీంద్ర జడేజా చాకచక్యంగా వ్యవహరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు గిల్‌కి గాయాన్ని తప్పించిన జడేజా.. మరోవైపు క్యాచ్‌ని అందుకుని టీమిండియాకి వికెట్ చేజారకుండా జాగ్రత్తపడ్డాడు. టీ20 సిరీస్ ఆడుతూ గాయపడిన జడేజా.. మూడు వారాల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ఫీల్డింగ్ విభాగంలో మెరవడం విశేషం. ఇక జడేజా క్యాచుకు సంబందించిన వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పంచుకోవడంతో అది చూసిన అభిమానులు జడ్డూను ప్రశంసిస్తున్నారు. 'జడేజా.. నువ్ తోపు', 'సూపర్ ఫీల్డింగ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 195 ర‌న్స్‌కే ఆలౌట్:

195 ర‌న్స్‌కే ఆలౌట్:

ఉద‌యం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 72.3 ఓవ‌ర్ల‌లో 195 ర‌న్స్‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్లు మెల్‌బోర్న్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. తొలి సెష‌న్‌లో స్పిన్న‌ర్ అశ్విన్ ఆసీస్ ప్లేయ‌ర్ల‌ను ఇబ్బందిపెట్ట‌గా.. ఆ త‌ర్వాత సెష‌న్‌లో స్పీడ్‌స్ట‌ర్ బుమ్రా త‌న మార్క్ చాటాడు. ఇక తొలి టెస్టు ఆడుతున్న హైద‌రాబాదీ ప్లేయ‌ర్ సిరాజ్‌.. రెండు వికెట్లు తీసుకున్నాడు. కీల‌క‌మైన ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను అత‌ను ఔట్ చేశాడు. బుమ్రా నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌లో ల‌బుషేన్‌ అత్య‌ధికంగా 48 ర‌న్స్ చేశాడు. వేడ్ 30, హెడ్ 38 ర‌న్స్ చేశాడు.

ముగిసిన తొలి రోజు ఆట: ఆసీస్ ఆలౌట్.. మయాంక్‌ డకౌట్‌.. భారత్ 36/1

Story first published: Saturday, December 26, 2020, 15:27 [IST]
Other articles published on Dec 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+