For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముగిసిన తొలి రోజు ఆట: ఆసీస్ ఆలౌట్.. మయాంక్‌ డకౌట్‌.. భారత్ 36/1

Boxing Day Test: Jasprit Bumrah, Mohammed Siraj, Shubman Gill stars India dominate Australia in Day 1

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మరోసారి నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన చేటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇంకో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్‌ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో టెస్టు తొలి రోజు భారత్ ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేసిన విషయం తెలిసిందే.

 అశ్విన్ మాయ:

అశ్విన్ మాయ:

శనివారం ఉదయం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్ ‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. అజింక్య రహానే సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు బంతి అందివ్వడంతో ఆ ప్రణాళిక ఫలించింది. ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ (30)ను యాష్ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో వేడ్‌.. రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. అశ్విన్ మరోసారి మాయ చేయడంతో స్టార్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్ ‌(0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో ఆసీస్‌ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సిరాజ్‌కు తొలి వికెట్:

సిరాజ్‌కు తొలి వికెట్:

అనంతరం మార్నస్‌ లబుషేన్, ట్రావిస్‌ హెడ్ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే 80కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు. హెడ్‌ను ఔట్‌ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధ శతకానికి చేరువైన లబుషేన్..‌ హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటవ్వడంతో ఆసీస్ 134 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. లబుషేన్‌ను ఔట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో సిరాజ్ మెయిడెన్‌ వికెట్‌ తీశాడు.

59 పరుగులకే మరో 5 వికెట్లు:

59 పరుగులకే మరో 5 వికెట్లు:

ఈ సమయంలో కెప్టెన్‌ టిమ్ ‌పైన్ ‌(13), కామరూన్‌ గ్రీన్ ‌(12) కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే సిరాజ్‌, అశ్విన్‌, బుమ్రా మరింత విజృంభించడంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో నాథన్‌ లైయన్‌ (20; 17 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడగా జట్టు స్కోర్‌ 195కి చేరింది. కమిన్స్ ‌(7), స్టార్క్ ‌(9), హేజిల్‌వుడ్ ‌(4) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేసిన సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 15 ఓవ‌ర్లు వేసిన సిరాజ్ 40 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.

అగర్వాల్ డకౌట్‌:

అగర్వాల్ డకౌట్‌:

ఆపై తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను మిచెల్‌ స్టార్క్‌ ఆదిలోనే దెబ్బతీశాడు. మయాంక్‌ అగర్వాల్ ‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. దీంతో భారత్‌ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం నిలకడగా ఆడిన గిల్ ‌(28; 38 బంతుల్లో 5x4), పుజారా (7; 23 బంతుల్లో 1x4) వికెట్‌ కాపాడుకున్నారు. చెడు బంతులను మాటమే బౌండరీలకు తరలించారు. శనివారం ఆట పూర్తయ్యే సమయానికి వికెట్‌ నష్టపోయి 36 పరుగులు చేసింది.

భారత్ అంటేనే రెచ్చిపోయే స్మిత్..‌ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి!!

Story first published: Saturday, December 26, 2020, 13:28 [IST]
Other articles published on Dec 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+