హడలెత్తించిన బుమ్రా.. తిప్పేసిన అశ్విన్.. ఆకట్టుకున్న సిరాజ్.. ఆస్ట్రేలియా ఆలౌట్!

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు విజృంభిచారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్ దాటికి ఆసీస్ 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా పేసర్ బుమ్రా పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అశ్విన్ (3/35), సిరాజ్ (2/40) ఆకట్టుకున్నారు. మార్నస్ లబుషేన్ (48; 132 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్. మాథ్యూ వేడ్ (30), ట్రావిస్ హెడ్ (38) పర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బుమ్రా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని సాశించాడు.

ఆదిలోనే బుమ్రా షాక్:
శనివారం ఉదయం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్ (0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. ఆపై అజింక్య రహానె వ్యూహం మార్చి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు బంతి అందివ్వడంతో ఆ ప్రణాళిక ఫలించింది. ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (30)ను యాష్ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో వేడ్.. రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. అనంతరం స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అశ్విన్ మరోసారి మాయ చేశాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న లబుషేన్, హెడ్:
అనంతరం మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే 80కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధశతకానికి చేరువైన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో ఆసీస్ 134 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

59 పరుగులకే మరో 5 వికెట్లు:
ఈ సమయంలో కెప్టెన్ టిమ్ పైన్ (13), కామరూన్ గ్రీన్ (12) కాసేపు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే సిరాజ్, అశ్విన్, బుమ్రా మరింత విజృంభించారు. దీంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో నాథన్ లైయన్ (20; 17 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడగా జట్టు స్కోర్ 195కి చేరింది. కమిన్స్ (7), స్టార్క్ (9), హేజిల్‌వుడ్ (4) పరుగులు చేశారు.

సిరాజ్ అరంగేట్రం అదుర్స్:
ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మొహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 15 ఓవర్లు వేసిన సిరాజ్ తన బౌలింగ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్ వికెట్ తీశాడు. లబుషేన్, గ్రీన్ వికెట్లను సిరాజ్ తీసుకున్నాడు.
Boxing Day Test: లబుషేన్‌కు తెలుగోడి దెబ్బ.. టెస్టుల్లో సిరాజ్‌కు తొలి వికెట్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications