Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ అంటేనే రెచ్చిపోయే స్మిత్..‌ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి!!

Boxing Day Test: Steve Smith out for duck, 1st vs India in international cricket
IND VS AUS Boxing Day Test:Steve Smith bags a Duck for First time in Tests VS India| Smith vs Ashwin

మెల్‌బోర్న్‌: కొందరు బ్యాట్స్‌మన్‌.. కొన్ని దేశాలపై చెలరేగి ఆడుతుంటారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా, మొహ్మద్ యూసుఫ్, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్, అశిమ్ ఆమ్లా లాంటి వారు ఒక్కో దేశంపై భారీగా పరుగులు చేసేవారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌.. టీమిండియాపై ఫార్మాట్ ఏదైనా సరే విరుచుకుపడుతుంటాడు. కానీ ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. స్మిత్ ‌(0) టెస్టుల్లో తొలిసారి భారత జట్టు చేతిలో డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడిలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇదే తొలిసారి.

శనివారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా తొలుత ఓపెనర్‌ జో బర్న్స్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌.. మాథ్యూ వేడ్ ‌(30), స్టీవ్‌ స్మిత్ ‌(0)ను స్వల్పవ్యవధిలో పెవిలియన్‌ పంపాడు. స్మిత్‌ ఆడిన బంతి ఎడ్జ్‌ తీసుకోగా.. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పుజారా డైవ్‌ చేస్తూ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా ఆదిలోనే మూడు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. మెల్‌బోర్న్‌ మైదానంలో టెస్టుల్లో 113.5 సగటు ఉన్న స్మిత్ ఇలా డకౌట్ అవ్వడం విశేషం.

అనంతరం మార్నస్‌ లబుషేన్, ట్రావిస్‌ హెడ్ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే 80కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు. ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేయడంతో భారీ భాగస్వామ్యానికి భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధశతకానికి చేరువైన లబుషేన్..‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటవ్వడంతో ఆసీస్ 134 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

ఈ సమయంలో కెప్టెన్‌ టిమ్ ‌పైన్ ‌(13), కామరూన్‌ గ్రీన్ ‌(12) కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే సిరాజ్‌, అశ్విన్‌, బుమ్రా మరింత విజృంభించారు. దీంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో నాథన్‌ లైయన్‌ (20; 17 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడగా జట్టు స్కోర్‌ 195కి చేరింది. కమిన్స్ ‌(7), స్టార్క్ ‌(9), హేజిల్‌వుడ్ ‌(4) పరుగులు చేశారు.

Story first published: Saturday, December 26, 2020, 13:03 [IST]
Other articles published on Dec 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+