న్యూజిలాండ్ 348 ఆలౌట్.. షా, పుజారా విఫలం.. భారత్ 78/2

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 348 పరుగులకు ఆలౌట్ చేసిన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీషా(14), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(11) మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిని ట్రెంట్ బౌల్టే ఔట్ చేశాడు. దీంతో టీ విరామ సమయానికి భారత్ 32 ఓవర్లలో 2 వికెట్లకు 78 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(52 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0 బ్యాటింగ్) ఉన్నారు.
ఇక అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో విలియమ్సన్(89), రాస్ టేలర్(44), కైలీ జేమీసన్(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ(5/65) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. రవిచంద్రన్ అశ్విన్ (3/99) మూడు వికెట్లు, బుమ్రా(1/88), మహ్మద్ షమీ (1/91) చెరొక వికెట్ తీశారు.

ఆడుకున్న టెయిలండర్లు..
ప్రధాన వికెట్లు తీసి ఆధిక్యం తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న కోహ్లీసేనకు ఆతిథ్య టెయిలండర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. తమ బౌలింగ్‌తో హడలెత్తించిన ఆతిథ్య బౌలర్లు బ్యాట్‌తోనూ మెరవడంతో కివీస్‌కు 183 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది.

జేమీసన్ సూపర్ బ్యాటింగ్..
ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలింగ్‌లో అదరగొట్టిన ఈ అరంగేట్ర ప్లేయర్.. బ్యాటింగ్‌లోను తనదైన ప్రదర్శన కనబర్చాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు.

మరోసారి షా, పుజారా..
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది యువ ఓపెనర్ పృథ్వీ షా(14) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో 27 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(11)తో మయాంక్ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసిన బౌల్ట్ మరోసారి దెబ్బతీశాడు. దీంతో రెండో వికెట్ నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications