Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Border Gavaskar Trophy: రోహిత్ శర్మకు అగ్ని పరీక్ష.. ఐదు టెస్ట్‌లతో తేలనున్న భవితవ్యం!

Border Gavaskar Trophy: Next 5 Tests likely to decide Rohit Sharmas future as India Test captain

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ‌కు అసలు సిసలు పరీక్ష ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతని కెప్టెన్సీ భవితవ్యానికి పరీక్షగా మారింది. ఆసియాకప్ 2022, టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతలను కోల్పోయిన రోహిత్ శర్మ.. టెస్ట్ కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు టీమిండియా ప్రతిష్టాత్మక బోర్డర్‌‌‌‌‌‌‌‌-గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ కోసం రెడీ అవుతుంటే... మరోవైపు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ టెస్ట్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ఈ నెల 9 నుంచి మొదలయ్యే ఈ మెగా సిరీస్‌‌‌‌‌‌‌‌ (4 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు)ను గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించి తీరాలి. అలా జరిగితేనే హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌.. టెస్ట్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా మరికొన్ని రోజులు ముందుకు సాగుతాడు. లేదంటే అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మరెవరైనా రావచ్చొనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే రోహిత్‌‌‌‌‌‌‌‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

బ్యాటింగ్‌లోనూ మెరవాలి..

బ్యాటింగ్‌లోనూ మెరవాలి..

నాయకత్వంతో పాటు రోహిత్‌ బ్యాటింగ్‌తోనూ ఈ సిరీస్‌లో మెప్పించాల్సి ఉంది. కెరీర్ ప్రారంభంలో టెస్ట్‌ల్లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్.. మొదట్లో అదరగొట్టినా ఆ తర్వాత విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో‌ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకాలు సాధించాడు. కానీ ఆ తర్వాత మూడో శతకం కోసం మరో 19 మ్యాచ్‌ల వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశాల్లో పేలవ ప్రదర్శన చేశాడు. స్వదేశంలో 2019 సౌతాఫ్రికాతో సిరీస్‌లో టెస్టుల్లోనూ ఓపెనర్‌గా మారడంతో అతని దశ తిరిగింది. విశాఖలో ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు.

మూడో మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం బాదేశాడు. 2021 ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ రాణించాడు. కానీ గాయాల కారణంగా ఇటీవల అతని టెస్టు కెరీర్‌ సజావుగా సాగడం లేదు. టీమిండియా ఆడిన గత 10 టెస్టుల్లో 8 మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. చివరగా నిరుడు మార్చిలో శ్రీలంకతో రెండు టెస్టుల్లో కలిపి 90 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతను బ్యాట్‌తోనూ రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఉంది.

ఫలితాలను బట్టే నిర్ణయం..

ఫలితాలను బట్టే నిర్ణయం..

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌తో 2021-23 సైకిల్‌‌‌‌‌‌‌‌ పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హయాంలో 2023-25 సైకిల్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. 'కెప్టెన్సీ మార్పు గురించి చర్చించలేదు. కానీ కొత్త సైకిల్‌‌‌‌‌‌‌‌లోనూ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగాలంటే కచ్చితంగా ఫలితాలు చూపెట్టాలి. ఆ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ను బట్టే సారథిని కొనసాగించాలా? వద్దా? అనేది డిసైడ్‌‌‌‌‌‌‌‌ అవుతుంది' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.

2013కు ముందు భారత్ చివరిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత 2018లో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. రోహిత్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అయ్యాక.. టీమిండియా వన్డే, టీ20ల్లోనంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించింది.

మరో ఐసీసీ టైటిల్ కోల్పేమన్న బీసీసీఐ...

మరో ఐసీసీ టైటిల్ కోల్పేమన్న బీసీసీఐ...

టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లోనూ టాప్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు చేరువవుతోంది. కానీ రోహిత్‌‌‌‌‌‌‌‌ ఒక్క ఐసీసీ ట్రోఫీని మాత్రం సాధించిపెట్టలేకపోతున్నాడు. అందుకే బీసీసీఐ కూడా ఐసీసీ ట్రోఫీ కోసం ఆతృతగా వెయిట్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోలేం. ఈ విషయాన్ని రోహిత్‌‌‌‌‌‌‌‌కు తెలిపాం. మనం వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్​ గెలవకపోతే ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని విజయాలు సాధించినా వృథాయే. అందుకే ఈసారి ఆ కరువు నుంచి బయటపడాలని భావిస్తున్నాం'అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Story first published: Monday, February 6, 2023, 17:23 [IST]
Other articles published on Feb 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+