Border-Gavaskar Trophy: బరాబర్ టర్నింగ్ ట్రాకే.. అదే మా బలం.. నలుగురు స్పిన్నర్లతో ఆడుతాం!

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది. గురువారం నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలవ్వనుంది. అంతా ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌కు బీసీసీఐ టర్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదర్బ క్రికెట్ అసోసియేషన్(వీసీఏ) ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. టీమిండియా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే వికెట్‌ను రూపొందిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

పచ్చని గడ్డితో పిచ్..
మ్యాచ్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. వికెట్‌పై పచ్చని గడ్డి ఉందని, సెంటర్‌లో బ్రౌన్‌గా మారిందని, మ్యాచ్ సమయానికి గడ్డిని కట్ చేసి స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే విధంగా సిద్దం చేస్తారని తెలిపింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌లో టీమిండియాకు విజయం కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ క్రమంలోనే బీసీసీఐ.. టర్నర్ వికెట్‌కు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 'మేం మాకున్న అడ్వాంటేజ్‌ను వీలైనంత వరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే టర్నర్స్ వికెట్ తయారు చేయాలనుకుంటున్నాం. స్పిన్నర్లు మా అతిపెద్ద బలం. వారికి బెస్ట్ కండిషన్స్‌ను అందుబాటులో ఉంచి వికెట్లు తీసేలా చేయడం మా బాధ్యత'అని ఓ అధికారి తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

నలుగురి స్పిన్నర్లతో..
టర్నింగ్ ట్రాక్ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు కూడా తెలిపింది. గతంలో తమ స్పిన్‌తో భారత్‌కు విజయాలు అందించిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను జట్టులోకి తీసుకోవాలని రాహుల్ ద్రవిడ్ అండ్ కో భావిస్తుందట. ఈ నలుగురికి తోడుగా సిరాజ్, మహమ్మద్ షమీలతో మొత్తం ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు.

మ్యాచ్ రోజే తుది నిర్ణయం..
అయితే తుది జట్టుపై మ్యాచ్ రోజు పిచ్‌ను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 'తుది జట్టుపై టీమ్‌మేనేజ్‌మెంట్ మ్యాచ్ రోజు ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది. ఆ రోజు ఉదయం వికెట్‌ను పరిశీలించి జట్టును ఎంపిక చేస్తారు. అయితే మా ప్రణాళికల్లో మాత్రం నలుగురు స్పిన్నర్లు ఆడించాలనుకుంటున్నాం.'అని ఆ అధికారి వివరించాడు. నలుగురు స్పిన్నర్లతో ఆడితే ఓ బ్యాటర్ పక్కనపెట్టాల్సి వస్తోంది. అప్పుడు బ్యాటింగ్ విభాగం బలహీనంగా మారనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications