Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Border–Gavaskar Trophy: రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. కోహ్లీ వల్ల కూడా కాలేదు!

 Border–Gavaskar Trophy: If Rohit scored century in Test series vs Australia, he creates rare record

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఈ మెగా సిరీస్‌కు తెరలేవనుంది. గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ ఆసక్తికర సిరీస్‌ మొదలవ్వనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన ఘనత ఊరిస్తోంది. భారత క్రికెట్‌లో మరెవరూ సాధించని ఈ రికార్డు‌కు హిట్ మ్యాన్ సెంచరీ దూరంలో ఉన్నాడు. ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ ఓ సెంచరీ బాదితే.. మూడు ఫార్మాట్లలో సారథిగా శతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కనున్నాడు.

 ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు..

ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు..

టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. కెప్టెన్‌గా ధోనీ వన్డే, టెస్ట్‌ల్లో శతకాలు నమోదు చేసినా.. టీ20ల్లో మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా టీ20ల్లో సెంచరీ చేయలేదు. గతేడాది ఆసియా కప్‌ 2022 విరాట్ సెంచరీ బాదినా.. అప్పటికే అతను కెప్టెన్సీ వదిలేసాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2020లో వన్డే సెంచరీ అందుకున్న రోహిత్.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అయితే కరోనా, గాయాలు, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రోహిత్ చాలా తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

టీ20ల్లో కెప్టెన్‌గా రెండు సెంచరీలు

టీ20ల్లో కెప్టెన్‌గా రెండు సెంచరీలు

టీ20ల్లో ఇప్పటి వరకు నాలుగు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. ఇందులో రెండు సార్లు కెప్టెన్‌గా ఉన్నప్పుడే సాధించాడు. విరాట్ కోహ్లీకి డిప్యూటీగా.. అతని గైర్హాజరీలో తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన రోహిత్.. 2017లో శ్రీలంకపై 43 బంతుల్లో 118, 2018లో వెస్టిండీస్‌పై 61 బంతుల్లో 111 పరుగు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్ట్‌ల్లోని 8 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఒక్క సెంచరీ సాధించినా అరుదైన ఫీట్ తన పేరిట లిఖించుకుంటాడు. ఈ సిరీస్‌లో టీమిండియా గెలవాలంటే ఓపెనర్‌గా రోహిత్ రాణించడం కీలకం.

టెస్ట్‌ కెప్టెన్సీకి అసలు పరీక్ష..

టెస్ట్‌ కెప్టెన్సీకి అసలు పరీక్ష..

విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అసలు సిసలు పరీక్షగా మారింది. ఆసియాకప్ 2022, టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతలను కోల్పోయిన రోహిత్ శర్మ.. టెస్ట్ కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్ గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించి తీరాలి. అలా జరిగితేనే హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌.. టెస్ట్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా మరికొన్ని రోజులు ముందుకు సాగుతాడు. లేదంటే అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మరెవరైనా రావచ్చొనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే రోహిత్‌‌‌‌‌‌‌‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఓపెనర్‌గా సూపర్ రికార్డు..

ఓపెనర్‌గా సూపర్ రికార్డు..

నాయకత్వంతో పాటు రోహిత్‌ బ్యాటింగ్‌తోనూ ఈ సిరీస్‌లో మెప్పించాల్సి ఉంది. కెరీర్ ప్రారంభంలో టెస్ట్‌ల్లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్.. మొదట్లో అదరగొట్టినా ఆ తర్వాత విఫలమయ్యాడు. స్వదేశంలో 2019 సౌతాఫ్రికాతో సిరీస్‌లో టెస్టుల్లోనూ ఓపెనర్‌గా మారడంతో అతని దశ తిరిగింది. రోహిత్‌ టెస్టుల్లో ఇప్పటివరకూ 77 ఇన్నింగ్స్‌ల్లో 46.13 సగటుతో 3137 పరుగులు చేశాడు. అందులో ఓ ద్విశతకం, 7 శతకాలున్నాయి. అయితే ఓపెనర్‌గా 30 ఇన్నింగ్స్‌ల్లో 55.42 సగటుతో 1552 పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్‌గానే డబుల్‌ సెంచరీ చేసిన అతను.. మరో నాలుగు శతకాలు ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Monday, February 6, 2023, 21:00 [IST]
Other articles published on Feb 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+