
జెర్సీ మూవీ రీమేక్‌లో
మృణాళ్ ఠాకూర్ మొదటగా మరాఠి, హిందీలో పలు సీరియర్స్ చేసింది. కుంకుమ్ భాగ్య సీరియల్‌తో చాలా ఫేమస్ అయింది. దాంతో ఆమెకు మరాఠి, హిందీ సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో నటించి తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. దాంతో స్టార్ హీరోయిన్ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో మృణాళ్ ఠాకూర్ బిజీబిజీగా ఉంది.
ప్రస్తుతం ఆమె క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. నాచురల్ స్టార్ నాని 'జెర్సీ' మూవీ హిందీలో రీమేక్ అవుతోంది. అందులో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అందులో మృణాళ్ హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న జెర్సీ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.

ప్రేమలో పడిపోయా
జెర్సీ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాళ్ ఠాకూర్.. తాను ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు చెప్పింది. 'ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిపిచ్చిగా ప్రేమించా. నా సోదరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలా నేను కూడా క్రికెట్ చూడటం మొదలెట్టా.
ఆ తర్వాత ఆటను ఇష్టపడడం మొదలుపెట్టి.. ఆ క్రమంలో కోహ్లీ ఆట చూసి ప్రేమలో పడిపోయా. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసా. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నీలిరంగు జెర్సీ ధరించి టీమిండియా తరపున చీర్స్ చేశా. ప్రస్తుతం జెర్సీ లాంటి క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని మృణాళ్ పేర్కొంది.
T20 World Cup: ఆ రెండు రోజులు అస్సలు నిద్ర పట్టలేదు.. ఏం చేయాలో తెలియలేదు: టీమిండియా స్పిన్నర్

అనుష్కతో ప్రేమ వివాహం
విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో ఇద్దరు తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు దూరమైంది. అనుష్క చివరి సారిగా 2018లో 'జీరో' సినిమాలో నటించింది. ఇటీవల నిర్మాతగా మారిన అనుష్క.. పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి ఓటీటీలో విడుదల చేస్తోంది. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'ఖాలా' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది.

23 వేల పరుగులు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 96 టెస్టులాడి 51.01 సగటుతో 7765 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు. ఇక 199 ఐపీఎల్ మ్యాచులలో 6076 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












