For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తెలుగు సినిమా నాకు బాగా నచ్చింది: కేఎల్ రాహుల్

ఇటీవల విడుదలైన చిత్రాల్లో సౌతిండియాకు చెందిన 'కాంతార చాప్టర్ 1'మూవీ తనకు బాగా నచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ సినిమా‌ తనకు పిచ్చెక్కించిందని కొనియాడాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కాంతార మూవీ యూనిట్‌తో పాటు ఈ సినిమా హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టిని ప్రశంసించాడు.

'కాంతార చాప్టర్ 1 మూవీ చూశాను. మరోసారి రిషభ్ శెట్టి తన నటనతో మ్యాజిక్ చేశారు. ఆయన నటన నాకు పిచ్చెక్కించింది. మంగళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు.'అని కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌పై కాంతార మూవీ టీమ్ స్పందించింది. కేఎల్ రాహుల్ పోస్ట్ చూశాక గర్వంగా ఉందని, తమ టీమ్‌కు ఇది విన్నింగ్ మూమెంట్ అని పేర్కొంది. తమ సినిమా చూసి ప్రశంసించిన కేఎల్ రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Blown Away KL Rahul Hails Rishab Shetty s Kantara Chapter 1 Magic
Photo Credit: X (twitter)

మైదానంలో రాహుల్ కాంతార సెలెబ్రేషన్స్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించిన అనంతరం కేఎల్ రాహుల్ కాంతార స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్‌తో సర్కిల్ గీసి.. నేలపై కొట్టి.. ఇది నా అడ్డా అంటూ సంబరాలు చేసుకున్నాడు.

అయితే తన హోమ్ గ్రౌండ్ అని చెప్పడానికి రాహుల్ ఇలా చేశాడని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ అనంతరం కాంతార సినిమాలోని సీన్‌ను తన సంబరాల కోసం వాడుకున్నానని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో తాను క్రికెటర్‌గా పెరిగానని, ఈ మైదానంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికే కాంతార స్టైల్‌ను ఎంచుకున్నానని రాహుల్ వివరణ ఇచ్చాడు.

కోహ్లీ సైతం..

రాహుల్ కాంతార స్టైల్‌కు గట్టిగా బదులివ్వాలని కోహ్లీ భావించాడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీని గెలిపించిన అనంతరం రాహుల్ తరహాలోనే సంబరాలు చేసుకోవాలనుకున్నాడు. కానీ అతను విజయం ముంగిట ఔటయ్యాడు. దాంతో కోహ్లీ కాంతార సంబరాలను అభిమానులు చూడలేకపోయారు. ఆ మ్యాచ్ అనంతరం తాను చేయాలనుకున్న సెలెబ్రేషన్స్ గురించి కోహ్లీ.. రాహుల్‌కు వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లు..

కాంతార సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, దర్శకత్వం, సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కించారు.

'కాంతార ఛాప్టర్ 1' పేరుతో పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాంతార ఛాప్టర్ 1 కూడా అంచనాలకు మించి దూసుకెళ్తోంది. తెలుగులో ఇప్పటికే రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇప్పటికే రూ. 400 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Story first published: Wednesday, October 8, 2025, 12:59 [IST]
Other articles published on Oct 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+