Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK:బ్లాక్‌బస్టర్ టీఆర్‌పీ రేటింగ్స్.. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రికార్డులన్నీ బ్రేక్!

Blockbuster TRP Rating For India vs Pakistan Match On Hotstar With 1.3 Crore

దుబాయ్: యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లప్పగించి ఎదురు చూసిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ ఊహించనట్లుగానే కనువిందు చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. గత కొన్ని రోజులుగా సరైన క్రికెట్ మ్యాచ్‌లు లేక కరువు మీదున్న అభిమానులకు ఈ హైఓల్టేజ్ సమరం కావాల్సినంత మజాను అందించింది. తూటాలు, తుపాకులు లేని ఈ యుద్దంలో దక్కిన విజయం భారత అభిమానులను సంతోషపర్చగా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.

రికార్డులన్నీ బ్రేక్..

రికార్డులన్నీ బ్రేక్..

ఈ మ్యాచ్ దెబ్బకు ఐపీఎల్ 2022 సీజన్, టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్‌స్టార్‌లో గరిష్టంగా కోటీ 30 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ కోటీ 20 లక్షలు మాత్రమే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్Xపాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌ల్లో ఈ వ్యూస్ వచ్చాయి. తాజా మ్యాచ్ ఆ రికార్డులన్నిటీని ఆసియాకప్ మ్యాచ్ అధిగమించింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే.

కోహ్లీ రాకతో..

కోహ్లీ రాకతో..

ఆదివారం కావడం.. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి భారీ ఎత్తున ప్రచారం జరగడం.. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ హైప్ ఏర్పడింది. అంతర్జాతీయంగా కూడా మరే సిరీస్‌లు లేకపోవడం ఈ సక్సెస్‌కు కారణమైంది. అంతేకాకుండాఈ మ్యాచ్ జరిగిన విధానం.. ఆఖరి బంతివరకు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మంచి టచ్‌లో కనబడటం వ్యూయర్‌షిప్ పెరగడానికి కారణమైంది.

సిక్సర్‌తో గెలిపించిన హార్దిక్..

సిక్సర్‌తో గెలిపించిన హార్దిక్..

ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు.

Story first published: Monday, August 29, 2022, 7:20 [IST]
Other articles published on Aug 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+