Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026:ఉప్పల్ మ్యాచ్‌లో చేతబడి.. మంత్రాలకు వికెట్లు పడతాయా?(వీడియో)

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం
ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది.

అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్‌కు హాజరైన ఓ అభిమాని సరదాగా చేసిన పని సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యింది. సీఎస్‌కే బ్యాటింగ్ సందర్భంగా ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకొని చేతబడి చేసినట్లుగా ఓ వీడియోను క్రియేట్ చేశాడు.

Black Magic or Just Luck Viral SRH Fan s Lemon Ritual Trends After CSK s Shock Defeat
Photo Credit: twitter (X)

మంత్రాలకు వికెట్లు పడతాయా?

ఈ వీడియో ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకొని చేతబడి చేస్తున్నట్లుగా మంత్రాలు చదివాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడు మంత్రలు చదివిన వెంట‌నే శివ‌మ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో స‌ద‌రు అభిమాని సంబరాల్లో మునిగితేలాడు. తన బ్లాక్ మ్యాజిక్ పనిచేసిందంటూ ఎగిరి గంతేసాడు. సరదాగా క్రియేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

మంత్రాలకు వికెట్లు పడతాయా? అని ఒకరంటే.. ఇదేం క్రేజ్ రా అయ్యా అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఈ చేతబడిపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసిందని కూడా సెటైర్లు పేల్చుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ లెటర్ హెడ్‌ను కూడా వైరల్‌ చేస్తున్నారు. మంత్రాల‌కు చింతకాయ‌లే రాలవు, వికెట్లు పడుతాయా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సరదా ఘటన అభిమానులను నవ్విస్తోంది.

Take a Poll

30 పరుగులు తక్కువ చేసినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59), హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34) ఒక వికెట్ దక్కింది.

అనంతరం సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), మాథ్యూ షార్ట్(30 బంతుల్లో 3 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శివమ్ దూబే(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(3/29) మూడు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. శివాంగ్ కుమార్(1/18), సాకిబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) చెరో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 19, 2026, 16:37 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+