Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 ఫైనల్‌కు పొలిటికల్ సెగ.. గుజరాత్‌ X రాజస్థాన్ ఫైట్ కాస్త.. బీజేపీ X కాంగ్రెస్‌గా...

BJP activists Support GT in IPL 2022 Final Match against RR

న్యూఢిల్లీ: మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌కు పొలిటికల్ సెగ తగిలింది. రెండు ఫ్రాంచైజీలకు.. దేశంలో రెండు ప్రధాన పార్టీ కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. దాంతో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన టైటిల్ ఫైట్ కాస్త కాంగ్రెస్ X బీజేపీ పోరుగా మారింది. కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్న రీతిలో సోషల్ మీడియాలో ఐపీఎల్ 2022 సీజన్‌ను కూడా ప్రధాన పార్టీల కార్యకర్తలు వాడేసుకుంటున్నారు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరింది.

బీజేపీ సపోర్టర్స్..

ఇక గుజరాత్ చేతిలో ఖంగుతిన్న రాజస్థాన్.. కీలక క్వాలిఫయర్ 2లో ఆర్‌సీబీ మట్టికరిపించి టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. మరోసారి గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్‌కు బరోడాకు చెందిన హర్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, రాజస్థాన్ రాయల్స్‌కి కేరళ కుర్రాడు సంజూ శాంసన్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే గుజరాత్‌లో కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలో ఉంది. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే.

రాజస్థాన్‌లో కాంగ్రెస్..

నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ ఫైనల్ చేరడంతో బీజేపీ మద్ధతుదారులతో పాటు మోదీ ఫ్యాన్స్, గుజరాత్ టైటాన్స్‌కి భారీగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు రాజస్థాన్ గెలవాలని కోరుకుంటున్నారు. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను కాస్తా గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌గా కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్‌గా అభివర్ణిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ను ఓడించినట్లే...

కాంగ్రెస్‌ను ఓడించినట్లే...

కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి, గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే మోదీ వీరాభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా... రాజస్థాన్ రాయల్స్ విజయంతోనే కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ అభిమానులు బదులిస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ 2022 సీజన్‌కు రాజకీయ రంగు పూయడంతో సాధారణ అభిమానులు చికాకుకు గురవుతున్నారు.

Story first published: Sunday, May 29, 2022, 17:07 [IST]
Other articles published on May 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+