
గవాస్కర్‌కు రెండు సీట్లు
మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌కి వాంఖడే స్టేడియంలో రెండు సీట్లని ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) తాజాగా కేటాయించింది. ఈ రోజు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కు బర్త్ డే గిప్ట్‌గా.. స్టేడియంలోని ప్రెసిడెంట్స్ బాక్స్‌లో సన్నీ, అతని భార్యకు కలిపి రెండు శాశ్వత సీట్లని ఎంసీఏ కేటాయించింది. సన్నీ 71వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక రోజు ముందు ఎంసీఏ ఈ విషయాన్ని చెప్పి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది.

సీటింగ్‌లో మార్పులు చేర్పులు
1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌కు గవాస్కర్ వీడ్కోలు చెప్పినప్పుడు ఎంసీఏ గర్వారె పెవిలియన్‌లోని రెండు సీట్లను గావస్కర్, అతని భార్యకు కేటాయించింది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ ముందు స్టేడియం నవీకరణ పనుల్లో భాగంగా సీటింగ్‌లో మార్పులు చేర్పులు జరగడంతో ఆ సీట్లు కనిపించకుండాపోయాయి. ఆ తర్వాత ఎంసీఏ కూడా పట్టించుకోలేదు. తాజాగా సన్నీ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆ రెండు సీట్లనీ.. అదీ ప్రెసిడెంట్స్ బాక్స్‌లో ఎంసీఏ కేటాయించింది.

టెస్టుల్లో 10,122 పరుగులు
భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు, ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.

గొప్ప ఓపెనర్లలో ఒకరు
సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో గొప్ప ఓపెనర్లలో ఒకరుగా నిలిచారు. 1970, 1980లలో భారత బ్యాటింగ్‌లో ప్రధానమైన గవాస్కర్.. సుదీర్ఘ ఫార్మట్ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. కరీబియన్ బౌలర్లు సంధించే బంతులకి అప్పట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం బెంబేలెత్తిపోయేవారు. కానీ హెల్మెట్, గాడ్స్ లాంటి సేప్టీలు పెద్దగా లేని రోజుల్లోనే సన్నీ ఎంట్రీ మ్యాచ్‌లోనే వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేశారు. భారత్ క్రికెటర్లకే కాదు.. ప్రపంచానికి టెస్టుల్లో ఎలా ఆడాలో నేర్పించిన మాస్టర్ గవాస్కర్. 1983లో ప్రపంచకప్ సాధించిన టీమిండియా జట్టు సభ్యులు కూడా. ప్రస్తుతం క్రికెట్ కామెంటేర్‌గా గవాస్కర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
శ్రీశాంత్ ఆల్ టైం భారత టీ20 జట్టు.. తనను తానే ఎంచుకున్న శ్రీ.. కెప్టెన్ మాత్రం ధోనీ, కోహ్లీ కాదు!!


Click it and Unblock the Notifications












