వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో మరో కొత్త టీమ్!
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు దుమ్మురేపుతున్నాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బిహార్‌కు చెందిన ఈ 15 ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
ఇలాంటి ఆటగాడిని అందించిన బిహార్‌కు ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని బిలియనీర్ అనిల్ అగర్వాల్ డిమాండ్ చేశారు. భారత్‌లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన వేదాంతా గ్రూప్‌నకు అనిల్ అగర్వాల్ ఛైర్మన్. ఆయన తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.
బిహార్‌కు ఐపీఎల్ టీమ్ కావాలి..?
'ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరహాలోనే బిహార్‌కు కూడా అద్భుతమైన ఐపీఎల్ జట్టు ఉండాలని మీకు అనిపించడం లేదా? బిహార్ గడ్డ ఎంతో మంది నాణ్యమైన ఆటగాళ్లను దేశానికి అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు.
సమస్తిపుర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంలోనే రికార్డులు సాధించాడు. గోపాల్‌గంజ్‌లోని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటుతున్నాడు. ఇంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా బిహార్ క్రికెట్‌కు ఎందుకు అంతగా గుర్తింపు రావడం లేదు?

అది నా చిరకాల స్వప్నం..
బిహార్ యువత ప్రతి రంగంలో రాణించేలా అవకాశాలు కల్పించడం. మన కీడ్రాకారులకు వరల్డ్ క్లాస్ సౌకర్యాలు అందించడం నా చిరకాల స్వప్నం. బిహార్ నుంచి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది.'అని అగర్వాల్ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌పై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్పందించారు. 'బిహార్‌కు ఐపీఎల్ టీమ్ ఉండేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీ సహకారంతో ఓ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటాం' అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దాంతో ఐపీఎల్‌లో కొత్త టీమ్ రాబోతుందా అనే చర్చ ఊపందుకుంది.
కొత్త జట్లు కష్టమే..
నాలుగేళ్ల క్రితమే ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్లు భాగమయ్యాయి. ఇప్పటికే ఐపీఎల్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. దాంతో కొత్త ఫ్రాంచైజీలు ఇవ్వాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి, నార్త్ఈస్ట్ రాష్ట్రాల నుంచి మరో ఫ్రాంచైజీకి అనుమతి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బిహార్ చెందిన బిలియనీర్ రంగంలోకి దిగడంతో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్త జట్లు వచ్చే అవకాశాలు అయితే లేవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications