చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 స్కోర్!
విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలన రికార్డ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ 574 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. విజయ్ హజారే ట్రోఫీతో పాటు వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. ఈ క్రమంలో తమిళనాడు పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డ్‌ను బిహార్ అధిగమించింది.
2022లో అరుణాచల్ ప్రదేశ్ మీద నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 506 పరుగులు చేసింది. రెండు సందర్భాల్లో ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్ కావడం గమనార్హం. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బిహార్.. వైభవ్ సూర్యవంశీ(84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లతో 190), ఆయుష్ లోహరుక(56 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 116), సకిబుల్‌గని(40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 128 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు.

వైభవ్ విధ్వంసంతో..
పీయూష్ సింగ్(66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో బిహార్ భారీ స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేస్తే.. సకిబుల్ గని 32 బంతుల్లోనే శతకం బాదాడు. దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్ రికార్డ్ ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498/4 పరుగులు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో టాప్-3 స్కోర్లు ఇంగ్లండ్ పేరిటనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ వన్డేల్లో భారత్ అత్యధిక స్కోర్ 418/5. 2011లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్ సాధించింది.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్లు..
1.ఇంగ్లండ్ 498/4 నెదర్లాండ్స్ 2022
2. ఇంగ్లండ్ 481/6 ఆస్ట్రేలియా 2018
3. ఇంగ్లండ్ 444/3 పాకిస్తాన్ 2016
1. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు..
1 బీహార్ 574/6 అరుణాచల్ ప్రదేశ్ 2025 (నేడు)
2 తమిళనాడు 506/2 అరుణాచల్ ప్రదేశ్ 2022
3 ఇంగ్లాండ్ 498/4 నెదర్లాండ్స్ 2022
4 సర్రీ (Surrey) 496/4 గ్లౌసెస్టర్‌షైర్ 2007
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications