Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pat Cummins:చితక్కొట్టిన న్యూజిలాండ్.. తేలిపోయిన సన్‌రైజర్స్ బౌలర్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్యాట్ కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్.. వేలం తర్వాత ఆడిన తొలి టీ20లోనే తేలిపోయారు. న్యూజిలాండ్ బ్యాటర్ ధాటికి ధారళంగా పరుగులిచ్చుకున్నారు.

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ పోటాపడి పరుగులిచ్చుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్ 10.75 ఎకానమీతో 43 పరుగులు సమర్పించుకొని ఓ వికెట్ పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 4 ఓవర్లు వేసి 9.75 ఎకానమీతో 39 పరుగులు సమర్పించుకున్నాడు.

Big worry for SRH ahead of IPL 2024 as New Zealand hammer Pat Cummins

ఐపీఎల్‌లో భారీ ధర పలికిన ఈ ఇద్దరూ బౌలింగ్‌లో తేలిపోవడంతో ఆ ఫ్రాంచైజీల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా.. ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు తీసుకుంది.

ప్యాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు కూడా దక్కే అవకాశం ఉంది. అయితే భారీ ధర పలికిన ఆటగాళ్లు.. ఐపీఎల్ 2024 సీజన్‌లో విఫలమవడం ఖాయమని, ఫ్రాంచైజీలు అనవసరంగా వారిపై కోట్లు కుమ్మరించాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 215 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (68), డేవాన్ కాన్వే (63) అర్ధశతకాలతో సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది.

మిచెల్ మార్ష్(44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72 నాటౌట్), టీమ్ డేవిడ్(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించారు.

Story first published: Wednesday, February 21, 2024, 18:22 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+