Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐకి ఎదురు దెబ్బ.. పేటీఎమ్ బాటలోనే అన్‌అకాడమీ, అప్‌స్టాక్స్!

Big setback fo BCCI, now Upstok and Unacademy set to pullout as IPL Central Sponsor

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ కోసం రెండున్నర నెలల విండో సాధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవాలని ఇప్పటికే పీటీఎం భావిస్తుండగా.. ఆ కంపెనీ బాటలోనే ఐపీఎల్ అఫిషియల్ స్పాన్సర్స్ అన్‌ అకాడమీ, అప్‌స్టాక్స్ షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. లీగ్‌తో ఉన్న తమ కాంట్రాక్ట్‌ను కొనసాగించేందుకు ఇష్టం లేదని ఇప్పటికే బోర్డుకు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది వరకు ఈ రెండు కంపెనీలు రైట్స్‌ను కలిగి ఉన్నాయి. దీంతో ఈ రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ రైట్స్‌ను థర్డ్ పార్టీకి కేటాయిస్తే ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద బీసీసీఐ 5 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఐసీసీతో ఉన్న 5 మిలియన్ డాలర్ల స్పాన్సర్‌షిప్ నుంచి కూడా వైదొలగాలని అప్‌స్టాక్స్ భావిస్తోంది.

ఐపీఎల్ 2022 సీజన్ ఆశించిన రీతిలో సక్సెస్ కాకపోవడంతో బీసీసీఐపై స్పాన్సర్లు గుర్రుగా ఉన్నారు. ఊహించిన రీతిలో ప్రేక్షకాదరణ లభించకపోవడంతో తమ స్పాన్సర్షిప్‌ను వదులుకోవడానికి ఆయా కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ, టైటిల్ స్పాన్సర్ పేటీఎం తమ స్పాన్సర్షిప్ ను రద్దు చేయాలని బీసీసీఐని కోరుతుండగా.. టీమిండియా జెర్సీ స్పాన్సర్ బైజూస్ రూ. 86 కోట్లు బాకీ ఉంది.

ముంబై వేదికగా గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో జరిగే సిరీస్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న పేటీఎం.. రూ. 326.80 కోట్లతో 2019 లో నాలుగేండ్ల పాటు (2023) వరకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మరో ఏడాది గడువు ఉండగానే పేటీఎం మాత్రం బీసీసీఐతో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తోంది. తాము టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంటామని బీసీసీఐకి సమాచారమందించినట్టు తెలుస్తున్నది.

తమ డీల్‌ను 'మాస్టర్ కార్డ్' కు మళ్లించాలని కూడా ప్రతిపాదన పెట్టినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'అవును. వాళ్లు (పేటీఎం) తమ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించమని రిక్వెస్ట్ చేశారు. వాళ్లకు ఆ హక్కు ఉంది. కానీ అది జులై 1 కంటే ముందు చేసి ఉంటే బాగుండేది.'అని తెలిపారు.

Story first published: Sunday, July 24, 2022, 15:13 [IST]
Other articles published on Jul 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+