
న్యూఢిల్లీ: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సెకండ్ స్ట్రింగ్ టీమ్‌ను ఎంపిక చేసింది. స్టార్ పేసర్లు మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, స్టార్ బ్యాటర్స్ ఎయిడెన్ మార్క్‌రమ్, రాసీ వన్ డెర్ డస్సెన్ లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.
దాంతో యువ ఆటగాడు ఖయా జోండోకు తొలి జట్టును పిలుపు అందింది. 32 ఏళ్ల జోండో సౌతాఫ్రికా తరఫున ఇప్పిటివరకు 6 వన్డేలు ఆడి 146 రన్స్ చేసినా టెస్ట్‌ల్లో మాత్రం ఆడలేదు. దాంతో అతను బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆటగాళ్ల యూనియన్, క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే వారిని ఐపీఎల్‌కు అనుమతించాల్సి వచ్చిందని సెలెక్షన్ కన్వీనర్ తెలిపాడు.
ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే సౌతాఫ్రికా ఆటగాళ్లను బోర్డు ఆపడానికి వీళ్లేదనే ఒప్పందాన్ని ప్లేయర్ అసోసియేషన్ సీఎస్‌ఏతో చేసుకుంది. ఇక సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో కెప్టెన్ ఎల్గర్, బావుమా, కేశవ్ మహారాజ్ తప్ప సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. మార్చి 31 నుంచి డర్బన్ వేదికగా సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. సీఎస్‌ఏ తాజా నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లకు పెద్ద తలనొప్పి తప్పినట్లు అయింది.
సౌతాఫ్రికా టెస్ట్ టీమ్: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, డారిన్ డుపావిల్లోన్, సరెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, డువాన్ ఒలివర్, కీగన్ పీటర్‌సన్, ర్యాన్ రికెల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్‌మాన్, కైల్ వెర్రెయిన్స్, లిజాడ్ విలియొండోమ్స్.