Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది ఔటా.. నాటౌటా?

బిగ్ క్రికెట్ లీగ్ టీ20 టోర్నీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకిన బెయిల్స్ కింద పడలేదు. వికెట్ పక్కకు జరిగినా.. బెయిల్స్ ఎగిరి వికెట్లపైనే పడ్డాయి కానీ కిందపడలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన ఫ్యాన్ కోడ్.. ఈ వీడియోను షేర్ చేసి ఔటా?నాటౌటా? అని అభిమానులను ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Big Cricket League 2024 Out or Not-Out Ball Hit the Stump But Bails don t fall off
Photo Credit: X

మధ్యప్రదేశ్ టైగర్స్ వర్సెస్ యూపీ బ్రిజ్‌స్టార్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత దేశవాళీ క్రికెటర్ పవన్ నేగీ వేసిన బౌలింగ్‌లో యూపీ బ్రిజ్‌స్టార్స్‌ కెప్టెన్ చిరాగ్ గాంధీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ బెయిల్స్ కింద పడలేదు.

బౌల్డ్ కావడంతో మధ్యప్రదేశ్ టైగర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. బెయిల్స్ బిగ్ షాక్ ఇచ్చాయి. వికెట్ జరిగినా.. బెయిల్స్ కిందపడకపోవడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం బెయిల్స్ కిందపడితేనే క్లీన్ బౌల్డ్ అయినట్లు.

ఈ అవకాశంతో చెలరేగిన చిరాగ్ గాంధీ(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. అయినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టైగర్స్ 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 239 పరుగులు చేసింది. సాకేత్ శర్మ(101) శతకంతో చెలరేగగా.. పవన్ నేగి(87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులే చేసి ఓటమిపాలైంది. చిరాగ్ గాంధీ(101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగినా ఫలితం లేకపోయింది.

మాజీ క్రికెటర్లతో పాటు లోకల్ స్టార్స్‌తో భారత్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ అభిమానుల ఆదరణను సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్స్ సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, శిఖర్ ధావన్ వంటి మాజీ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగమయ్యారు. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

Story first published: Tuesday, December 17, 2024, 13:22 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+