
డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలోకి కోహ్లీసేనకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. జట్టును గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్దంతరంగా తప్పుకొని స్వదేశం చేరగా.. బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేరినట్లు తెలుస్తోంది.
అతని చేతి వేలికి కూడా గాయమైందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే అతని గాయం తీవ్రత గురించి స్పష్టత లేదని పేర్కొంది. స్కానింగ్ తీసిన తర్వాతే తెలుస్తుందని జట్టుకు సంబంధించి ఓ అధికారి తెలిపారు. అతను పడుతున్న ఇబ్బంది చూస్తుంటే మాత్రం వేలు విరిగినట్లే అర్థమవుతుందన్నారు. అదే జరిగితే సుందర్ సైతం ఈ టూర్ నుంచి తప్పుకోనున్నాడు.
ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు సుందర్ కూడా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది.

అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దాంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 24 మంది సభ్యులతో కూడిన జట్టులో ముగ్గురు గాయపడటం కోహ్లీసేనను కలవరపెడుతోంది.
ఇప్పటికే శుభ్‌మన్ గిల్ సైతం మరో ఇద్దరు ఓపెనర్లు పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను పంపించాలని కోహ్లీసేన కోరగా సెలెక్టర్లు తిరస్కరించారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పాటు స్టాండ్‌బై అభిమన్యు ఈశ్వరన్‌తో ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరొకరు అవసరం లేదని స్పష్టం చేశారు.