IPL 2026: గెలుపు జోరులో ఉన్న SRHకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే గాయాలతో పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో పేసర్ డేవిడ్ పేన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్రకటించింది.
డేవిడ్ పేన్ కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. అయితే అతని రిప్లేస్‌మెంట్ ఆటగాడు ఎవరో సన్‌రైజర్స్ వెల్లడించలేదు. గాయంతో టోర్నీకి దూరమైన ఆస్ట్రేలియా పేసర్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పేన్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ పేన్ రెండు వికెట్లు మాత్రమే తీసాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన డేవిడ్ పెన్ రెండు వికెట్లు తీసి 35 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండా 35 పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతను తుది జట్టులో చోటు కోల్పోయాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ సేవలను కోల్పోయింది. చేతి గాయంతో అతను టోర్నీ మొత్తానికి దూరం కాగా.. శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుషంకతో అతని స్థానాన్ని భర్తీ చేశారు. గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ప్యాట్ కమిన్స్ రీఎంట్రీకి రంగం సిద్దమైంది. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరేందుకు మార్గం సుగుమమైంది. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌కు అనుమతిచ్చింది. అతను ఏప్రిల్ 24న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇషాన్ కిషన్ నడిపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడింటిలో ఓడింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications