IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. స్టార్ పేసర్ గుడ్‌బై!
ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరంగా ఉండాలని జోష్ హేజిల్ వుడ్ నిర్ణయించుకున్నాడని ఓ రిపోర్ట్ పేర్కొంది.
ఐపీఎల్ 2027 సీజన్ కంటే వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి జోష్ హేజిల్ వుడ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా టోర్నీకి ఫిట్‌గా ఉండేందుకు ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరంగా ఉండాలని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు నివేదిక పేర్కొంది.

35 ఏళ్ల జోష్ హేజిల్ వుడ్.. ఆర్‌సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 8.77 ఎకానమీ, 17.55 సగటుతో 22 వికెట్లు తీసిన హేజిల్ వుడ్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 9.59 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు.
తరుచూ గాయాల బారిన పడే జోష్ హేజిల్‌వుడ్‌ను మెగా టోర్నీకి ఫిట్‌గా ఉంచాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ క్రమంలోనే అతని వర్క్‌లోడ్‌ను నిషితంగా పరిశీలిస్తోంది. ఇక నుంచి అత్యంత కీలకమైన సిరీస్‌ల్లో మాత్రమే ఆడించనుంది. ఒకవేళ అతను ఐపీఎల్ 2027 ఆడుతానన్నా.. ఎన్‌ఓసీ జారీ చేయకపోవచ్చు.
ఏది ఏమైనా.. వన్డే ప్రపంచకప్ 2027 కారణంగా జోష్ హేజిల్ వుడ్ సేవలను ఆర్‌సీబీ కోల్పోనుంది. అతని స్థానంలో మరో విదేశీ పేసర్‌ను ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే జోష్ హేజిల్ వుడ్ గైర్హాజరీ గురించి ఆర్‌సీబీ అధికారికంగా ప్రకటించలేదు. ఐపీఎల్ 2027 మినీ వేలం సమయంలో హేజిల్ వుడ్ గైర్హాజరీ గురించి స్పష్టత రానుంది.
మరోవైపు వన్డే ప్రపంచకప్ 2027 వేదికలను, టోర్నీ ఫార్మాట్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తుండగా.. మొత్తం 12 వేదికలను ఐసీసీ ఎంపిక చేసింది. టోర్నీ మొత్తంలో 57 మ్యాచ్‌లు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

