For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. రూ.11 కోట్ల ఆటగాడు దూరం!

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో అతను ఫస్టాఫ్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.

గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్.. 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ సిరీస్‌లో అతని వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో గత 6 నెలలుగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మయాంక్ యాదవ్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Big blow for LSG as star pacer Mayank Yadav to miss 1st half of IPL 2025 Report

మయాంక్ యాదవ్ గాయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ అతను బీసీసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఫిట్‌నెస్ సాధిస్తే ఐపీఎల్ 2025 సెకండాఫ్‌లో జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. మయాంక్ యాదవ్ గత 12 నెలలుగా గాయాలతో సావాసం చేస్తున్నాడు. గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్న మయాంక్ యాదవ్.. గత సీజన్‌లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అతను.. మూడు వికెట్లతో చెలరేగాడు. ఆర్‌సీబీ జరిగిన ఆ మరుసటి మ్యాచ్‌లోనే మరో మూడు వికెట్లు తీసి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. కానీ పక్కటెముకల గాయంతో నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్నా మయాంక్ యాదవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ నమ్మకం ఉంచింది. రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:
డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్‌రమ్, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్.

Story first published: Tuesday, March 11, 2025, 9:57 [IST]
Other articles published on Mar 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+