IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు ముందు స్టార్ ప్లేయర్‌కు గాయం!
శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సరిగ్గా వామప్ మ్యాచ్‌కు ముందు రోజు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. నెట్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. శుభ్‌మన్ గిల్ బొటన వేలికి బంతి బలంగా తాకింది. దాంతో నొప్పితో శుభ్‌మన్ గిల్ విలవిలాడాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆపేసి ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెడ్ బాల్ ఫార్మాట్‌కు సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. మంగళవారమే అక్కడికి చేరుకున్న భారత్.. బుధవారమే తమ సన్నహకాలను ప్రారంభించింది. గురువారం నెట్ సెన్సేషన్‌లో శుభ్‌మన్ గిల్ తీవ్రంగా బ్యాటింగ్ సాధాన చేశాడు. అయితే బొటన వేలికి గాయం కావడంతో మెడికల్ సాయం తీసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ గాయం పెద్దదా? చిన్నదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో ఈ పర్యటనకు దూరమయ్యారు. సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో దేశవాళీ పేస్ సెన్సేషన్ అకిబ్ నబీకి తొలిసారి టీమిండియా పిలుపు దక్కింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరాన్ష్ జైన్ జట్టులోకి వచ్చాడు. శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ సన్నాహక మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆగస్ట్ 15 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానండగా.. ఆగస్ట్ 23 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే..ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు ముఖ్యం. శుభ్‌మన్ గిల్ దూరమైతే భారత విజయవకాశాలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం జట్టులో అత్యంత నిలకడగా టెస్ట్‌ల్లో రాణించే ఏకైక బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

