Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐర్లాండ్‌తో టీ20 ‌సిరీస్.. నితీష్ కుమార్ రెడ్డి దూరం! పంజాబ్ ప్లేయర్‌కు చోటు

ఐర్లాండ్ పర్యటనకు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనకు కూడా నితీష్ దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. నితీష్ రెడ్డి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్జె‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.

'ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో భారత సెలెక్షన్ కమిటీ సూర్యాన్ష్ షెడ్జ్‌ను ఎంపిక చేసింది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత నితీష్ ఎడమ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత ఎక్కవగా ఉండటంతో కొంతకాలం విశ్రాంతి, రిహాబిలిటేషన్ అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దీంతో నితీష్ రెడ్డి రెండు టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు.

పంజాబ్ ఆటగాడికి చోటు..

ఇటీవలే శ్రీలంకలో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో సూర్యాన్ష్‌కు టీమిండియా పిలుపు దక్కింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన ఈ 23 ఏళ్ల యువ ఆటగాడు ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేయడంతో పాటు, టోర్నమెంట్‌లో మొత్తం 23 ఓవర్లు బౌలింగ్ చేసి బంతితోనూ రాణించాడు.

Big Blow for India Injured Nitish Kumar Reddy Ruled Out of Ireland T20Is and England Tour

అంతేకాకుండా, 2024-25లో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 251.92 స్ట్రైక్ రేట్‌తో 131 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. హార్దిక్ పాండ్యా‌కు బ్యాకప్‌గా నితీష్ రెడ్డిని సిద్దం చేయాలని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్‌కు అనూహ్య షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా తరహాలోనే నితీష్ కుమార్ రెడ్డి సైతం వరుసగా గాయాల బారిన పడుతున్నాడు.

వన్డే సిరీస్‌కు కూడా..

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా నితీష్ రెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. తొలుత చిన్న గాయమేనని భావించినా.. ఎమ్మారైలో తొడ కండారల్లో గాయమైనట్లు తేలింది. అతను కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుంది.

జులై 26-28 మధ్య ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1-11 మధ్య ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్‌లతో పాటు వన్డే సిరీస్‌కు కూడా నితీష్ రెడ్డి ఎంపికయ్యాడు. కానీ తాజా గాయంతో ఆ సిరీస్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశం ఉంది.

Story first published: Tuesday, June 23, 2026, 13:02 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+