
ఓవల్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనాకలకలం రేగింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి వైరస్ బారిన పడగా.. నలుగురు సపోర్ట్ స్టాఫ్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌ను ముందస్తు చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌కు తరలించినట్లు పేర్కొంది.
'శనివారం సాయంత్రం రవిశాస్త్రికి కరోనా పాజిటీవ్ అనే విషయం తెలియగానే బీసీసీఐ మెడికల్ టీమ్ ముందస్తు చర్యలు చేపట్టింది. రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో థెరపిస్ట్ నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించింది. ఈ నలుగురికి మరోసారి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు చేయనున్నారు. మెడికల్ టీమ్ స్పష్టత ఇచ్చేవరకు వీరు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నారు. మిగతా ఆటగాళ్లందరికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ వచ్చింది. గత రాత్రి ఒకటి.. ఈ ఉదయం మరొకసారి కరోనా టెస్ట్ చేశారు. దాంతోనే నాలుగో రోజు ఆట కొనసాగిస్తున్నారు. 'అని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు.
270/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా(17) 8 పరుగులే జోడించి పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత క్రీజులోకి అజింక్యా రహానే(0 బ్యాటింగ్) ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే బంతిని తప్పుగా అంచనా వేసిన రహానే.. ఫ్రంట్ లెగ్ ఆపే ప్రయత్నం చేశాడు.
కానీ బంతి స్వింగ్ అయి వికెట్ల వైపు దూసుకురావడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో అంపైర్ ఔటివ్వగా.. రహానే రివ్యూ తీసుకొని బచాయించాడు. రిప్లేలో బంతి వికెట్లను మిస్సవ్వడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ(40 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 104 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 296 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 197 రన్స్ లీడ్‌లో ఉంది.