For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాలంటైన్స్ డే.. స్టోయినీస్ బుగ్గ కొరికిన ఆడమ్ జంపా! గే అంటూ..!

Big Bash League Shares Adam Zampa Kisses Marcus Stoinis photo on Valentine’s Day

న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినీస్‌ల ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని గతంలోనే పలు వార్తలు వెలువడ్డాయి. ఈ ఇద్దరూ గేలు అని ప్రచారం కూడా జరిగింది. తాము గే కాదని ఈ ఇద్దరూ క్రికెటర్లు ప్రకటించారు. సహచర ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని దృవీకరించడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. కానీ తాజాగా బిగ్ బాష్ లీగ్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఈ ఇద్దరి ఫొటోలను షేర్ చేయడం చర్చనీయాంశమైంది.

పైగా ఈ ఫొటోల్లో ఈ ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక ఫొటోలో స్టోయినీస్ బుగ్గను ఆడమ్ జంపా కొరుకుతుండగా.. మరో ఫొటోలో ఒకరి పిర్రలను మరొకరు పిసుక్కుంటున్నారు. ఈ ఫొటోలు.. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో రొమాన్స్ చేసుకోవడం వంటి ఘటనలను చూసి ఈ ఇద్దరూ పక్కా గేలేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు అయిన మార్కస్ స్టోయినీస్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియాలోనే ఉండగా.. ఆ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చింది. తొలి టెస్ట్‌ను ఇన్నింగ్స్ 136 పరగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిన ఆసీస్.. పాఠాలు నేర్చుకుంటుంది.

ఢిల్లీ టెస్ట్‌లోనైనా విజయం సాధించాలనే తపనతో సన్నదమవుతోంది. ఇప్పటికే నాగ్‌పూర్ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై ప్రాక్టీస్ సెషన్ నిర్వహించిన ఆసీస్.. వికెట్ స్వభావం తెలుసుకోవడంతో పాటు భారత స్పిన్ విభాగానికి కౌంటర్ అటాక్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రెండో టెస్ట్ కోసం నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న ఆసీస్.. తుది జట్టులో మార్పులు చేయడంపై ఫోకస్ పెట్టింది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవడంతో పాటు వరుసగా విఫలమవుతున్నా డేవిడ్ వార్నర్‌పై వేటు వేయనుంది. గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన కామెరూన్ గ్రీన్ కూడా రెండో టెస్ట్ ఆడే అవకాశం ఉంది.

Story first published: Tuesday, February 14, 2023, 17:17 [IST]
Other articles published on Feb 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+