Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భువనేశ్వర్ చాలా హాటెస్ట్.. నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటా'

Bhuvneshwar Kumar Steals The Show in Yuvraj Singhs Gender-Swap Photo

ముంబై: 'జెండర్‌ స్వాప్' ఫేస్‌‌ యాప్‌ ద్వారా ప్రస్తుత భారత ఆటగాళ్లను అమ్మాయిలుగా మార్చిన ఫొటోలను ప్రపంచకప్‌ల హీరో, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'మీ స్నేహితురాలిగా వీరిలో ఎవరిని ఎంచుకుంటారు?' అని యువరాజ్‌ క్యాప్షన్‌ను జత చేసాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చూసిన ప్రతిఒక్కరు తమదైన స్టయిల్లో రిప్లై ఇస్తున్నారు.

నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటా

యువరాజ్‌ సింగ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుంది. ముఖ్యంగా టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌కు మంచి స్పందన లభిస్తోంది. అమ్మాయిగా భువీ చాలా అందరంగా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ పోస్టుకు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ రిప్లై ఇచ్చాడు. 'నా స్నేహితురాలిగా భువనేశ్వర్‌ను ఎంచుకుంటా' అని కామెంట్ చేసాడు. మాజీ పేసర్‌‌ ఆశిష్‌ నెహ్రా భార్య రష్మా కూడా భువీకే ఓటేశారు. స్టైలిష్‌ లుక్‌లో ఆటగాళ్లంతా అమ్మాయిలుగా చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

భువీ హాటెస్ట్

భువీ హాటెస్ట్

యువరాజ్‌ సింగ్ పోస్టుకు క్రికెటర్లు, ఫాన్స్ మాత్రమే కాదు సినీ తారలు కూడా స్పందిస్తున్నారు. 'భువీ హాటెస్ట్' అని బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ చౌదరి పోస్ట్ చేసాడు. 'నా ఓటు భువనేశ్వర్‌కే' అంటూ కరణ్‌ వాహి కామెంట్‌ చేశాడు. ఇదంతా ఒకెత్తయితే యువీ పోస్టుకు భువీ కూడా కామెంట్ చేసాడు. 'నేను భువీని ఎంచుకుంటా' అంటూ భువనేశ్వర్‌ కుమార్ తనకు తానే ఓటేసుకున్నాడు. టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ స్పందిస్తూ.. 'ఈ జాబితాలో మీ ఎంపిక కూడా ఉండాలని కోరుకుంటున్నా యూవీ పా' అంటూ కామెంట్‌ పెట్టాడు.

రోహితా చూడటానికి అందంగా ఉన్నావు

రోహితా చూడటానికి అందంగా ఉన్నావు

తాజాగా యజువేంద్ర చహాల్ కూడా‌ 'జెండర్‌ స్వాప్' ఫేస్‌‌ యాప్‌ ద్వారా 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మను అమ్మాయిగా మార్చిన విషయం తెలిసిందే. మేల్, ఫిమేల్ వర్షన్ ఫొటోలను పక్కపక్కనే పెట్టి షేర్ చేశాడు. దీనికి 'రోహితా చూడటానికి చాలా అందంగా ఉన్నావు. లవ్‌యూ' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్‌కు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. రోహిత్ అమ్మాయిగా బాగున్నాడని కామెంట్ చేశారు. దీనిపై రోహిత్ కూడా స‌ర‌దాగా స్పందించ‌డం విశేషం.

టీమిండియా కమెడియన్

టీమిండియా కమెడియన్

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఇళ్లకే ప‌రిమిత‌మైన క్రికెట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చహల్. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు. మాములుగానే కోతిపనులు చేసే చహల్‌కు లాక్‌డౌన్‌తో మరింత స్వేచ్చ దొరికింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతీ క్రికెటర్‌ను గెలుకుతూ.. వారితో చివాట్లు తింటూ.. మందలింపుకు గురవుతున్నాడు.

రోహిత్ విజయరహస్యం ఏంటో చెప్పిన జయవర్ధనే!!

Story first published: Tuesday, June 23, 2020, 16:21 [IST]
Other articles published on Jun 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+