టీమిండియాలోకి రమ్మంటే.. వద్దంటానా?: భువనేశ్వర్ కుమార్
తిరిగి టీమిండియాకు ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నానని వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. సెలెక్టర్లు ఎంపిక చేస్తే తాను ఎందుకు వద్దంటానని ప్రశ్నించాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను ప్రయత్నాలు చేయడం లేదని, ఆటను ఆస్వాదిస్తున్నానని స్పష్టం చేశాడు.
టీమిండియాలో ఒకప్పుడు ప్రధాన బౌలర్‌గా కొనసాగిన భువనేశ్వర్ కుమార్ జట్టుకు దూరమై 4 ఏళ్లు అవుతుంది. అతను చివరిగా 2022లో భారత్ తరఫున ఆడాడు. అయితే సౌతాఫ్రికా వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
అనభవం కోసం..
సౌతాఫ్రికా కండిషన్స్‌కు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని, అతని అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆర్‌సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన భువీ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు సీజన్లలో ఆర్‌సీబీ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. భారత ప్రధాన పేసర్లు గాయాల బారిన పడుతుండటంతో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.
నేను రెడీ కానీ.. నిర్ణయం వారిదే..
తాజాగా ఈ విషయంపై స్పందించిన భువనేశ్వర్ కుమార్ టీమిండియా తరఫున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాడు. 'సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేనెందుకు ఆడను. టీమిండియా తరఫున ఆడేందుకు నేను రెడీగా ఉన్నా. నిజాయితీగా చెప్పాలంటే నేను ఎంత రెడీ ఉణ్నాననే విషయాన్ని చెప్పలేను. ఎందుకంటే క్రికెట్ ఆడటమే నా పని. అందుకే యూపీ టీ20 లీగ్‌లో ఆడడానికి వచ్చా. ఏదో స్థాయికి వెళ్లడానికి ఇక్కడికి రాలేదు.
భారత జట్టుకు ఎంపిక కావాలని, లేదో ఎవరో ఏదో అన్నారని నేను యూపీ టీ20 లీగ్ ఆడటం లేదు. నేను ఎంత సన్నద్ధంగా ఉన్నానన్నది చెప్పాల్సింది నేను కాదు. నా రీఎంట్రీపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లు'అని భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ .. ఈ నెల 14న మొదలయ్యే యూపీటీ20 లీగ్‌లో లక్నో ఫాల్కన్స్‌కు సారథ్యం వహించనున్నాడు.
వయసు కాదు సమస్య..
మరోవైపు భువనేశ్వర్ కుమార్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. భువనేశ్వర్ కుమార్‌కు వయసు అడ్డంకి కాదని, వర్క్‌లోడ్ అతనికి అతిపెద్ద ప్రతికూలత అని చెప్పుకొచ్చాడు. 'భువనేశ్వర్ కుమార్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడాలని నేను కోరుకుంటున్నా.
కానీ అతను రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీలు ఆడటం లేదు కాబట్టి అతనిపై అంతగా వర్క్ లోడ్ లేదు. వన్డే క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు చాలా ఫిట్‌నెస్ కావాలి. అంతేకాకుండా నిరంతర శిక్షణ అవసరం. అతను నవంబర్ 2022 నుంచి భారత జట్టు తరఫున ఆడలేదు.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications