టెస్ట్ క్రికెట్ ఆడటమే నా ముందున్న ప్రధాన లక్ష్యం: భువనేశ్వర్ కుమార్

పుణె: ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడటమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. జూన్, జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు తన తదుపరి కార్యచరణను రూపొందించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అతన్ని టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ లక్ష్యంగానే ప్రిపరేషన్స్..
'టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకొనే సన్నద్ధమవుతాను. ఐతే టెస్టు మ్యాచులకు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారన్నది భిన్నమైన కథ' అని భువీ బదులిచ్చాడు. 'టెస్టు క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొనే ఐపీఎల్‌లో నా శిక్షణ, సాధన, వర్క్‌లోడ్ నిర్వహణ ఉంటుంది. ఎందుకంటే మున్ముందు చాలా టెస్టులు జరుగుతాయి. నేను ప్రాధాన్యమిస్తున్నదీ దానికే. అందుకే సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యేందుకు నా వైపు నుంచి అన్నీ చేస్తా' అని భువీ స్పష్టం చేశాడు.

ప్లాన్స్ ఏం లేవ్..
భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవడం లేదని భువీ తెలిపాడు. అందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయన్నాడు. 'ఇంతకు ముందులా దీర్ఘ కాలిక ప్రణాళికలు వేసుకోవడం ఆపేశా. ఎందుకంటే చాలా విషయాలు నాకు అనుకూలంగా ఉండటం లేదు. గాయాలవ్వడం, ఫామ్ కోల్పోవడం వంటివి జరుగుతున్నాయి. వర్క్ లోడ్ పర్యవేక్షణపై మాత్రం దృష్టి సారిస్తాను. ఎక్కువ రోజులు ఫిట్‌గా లేను కాబట్టి దేహదారుఢ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో మేం ఎక్కువ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా' అని భువీ వెల్లడించాడు.

రెండేళ్లు గాయాలు..
రెండేళ్లుగా భువీ గాయాలతో సతమతం అవుతున్నాడు. ఐపీఎల్‌లోనూ పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు. గత సీజన్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఎన్‌సీఏలో సుదీర్ఘ కాలం ఉండి ఫిట్‌నెస్ సాధించి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీసులకు ఎంపికయ్యాడు. మూడు వన్డేల్లో 6 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం సమయాత్తం అవుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ అయిన భువీ.. ఐపీఎల్‌లో మంచి రికార్డుంది. పైగా మెగా టోర్నీకి ముందు అతను ఫామ్‌లోకి రావడం పట్ల హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications