'జట్టు నిండా యువకులే అయినా.. వారికి ఎంతో అనుభవం ఉంది! అంతా ఐపీఎల్ వల్లే'

కొలంబో: శ్రీలంక వెళ్లిన భారత యువ ఆటగాళ్లపై టీమిండియా సీనియర్ పేసర్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు ఎంపికైన కొత్త ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడిన అనుభవమే ఇందుకు కారణమని భువీ పేర్కొన్నాడు. ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఐపీఎల్ అనుభవాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకొస్తున్నారన్నాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు భువీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

యువకులే కానీ
తాజాగా భువనేశ్వర్ కుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ... 'శ్రీలంక పర్యటనకు వచ్చిన భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. వారంతా యువకులే కానీ కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఆయా జట్ల తరఫున అందరూ అద్భుతంగా రాణించారు. ఈ అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుంది. ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఐపీఎల్ అనుభవాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మా జట్టు అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. కచ్చితంగా మ్యాచులు గెలుస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు. భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.

దేశవాళీ క్రికెట్ ఉపయోగపడింది
గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడటం తనకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. 'నేను కోలుకున్న సమయంలో దేశవాళీ క్రికెట్ బాగానే సాగుతోంది. ఫిట్‌నెస్ సాధించడం, పునరాగమనం చేయడం పైనే అప్పుడు నా దృష్టి ఉంది. ఇంగ్లండ్ సిరీసుకు ముందు దేశవాళీ క్రికెట్ ఆడటంతో మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. ఆటగాళ్లు దేనినీ తేలిగ్గా తీసుకోవద్దు.
దృఢంగా, ప్రేరణతో ఉండేందుకు దేశవాళీ క్రికెట్ ఉపయోగపడింది' అని భువీ తెలిపాడు. నిజానికి భువనేశ్వర్ రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లోనూ గాయపడటంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. సయ్యద్ ముస్తాక్, విజయ్ హజారే ఆడటంతో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు. ఇక ఐపీఎల్ 2021లో ఆరంభ మ్యాచులు ఆడి మళ్లీ గాయపడ్డాడు. అయితే ఇప్పుడు కోలుకున్నాడు.
సేనపై అత్యధిక సెంచరీలు చేసింది వీరే.. టాప్-5లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్! రోహిత్‌కు దక్కని చోటు!!

ఒకేసారి రెండు దేశాల్లో
ప్రస్తుతం భారత జట్టు ఒకేసారి రెండు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలో సీనియర్ టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టు శ్రీలంకలో ఉంది. ఆరుగురు క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి లంక పర్యటనలో అరంగేట్రం చేయనున్నారు. ఇక కరోనా కారణంగా జులై 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌ను 18వ తేదీకి మార్చిన విషయం తెలిసిందే. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29 తేదీల్లో జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications