Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సేనపై అత్యధిక సెంచరీలు చేసింది వీరే.. టాప్-5లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్‌! రోహిత్‌కు దక్కని చోటు!!

Virat Kohli Records: 11 Test Centuries Scored In SENA Countries Highest By Any Batsman

హైదరాబాద్: సొంత గడ్డపై ఏ బ్యాట్స్‌మన్‌ అయినా చెలరేగడం సహజమే. హాఫ్ సెంచరీ, సెంచరీలు సునాయాసంగా చేసేస్తుంటారు. టెస్టుల్లో అయితే ఇది మరి సులువు. ఎందుకంటే అండర్-19, దేశీయ క్రికెట్, అంతర్జాతీయ మ్యాచులు స్వదేశంలో ఎక్కువగా ఆడడంతో.. సొంత గడ్డపై ఎలా ఆడాలో తెలిసుంటుంది. పిచ్, పరిస్థితులపై ఓ అవగాహన ఉంటుంది. అదే విదేశీ గడ్డపై మాత్రం ఆడడం సులువు కాదు. ఇక సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా)పై సెంచరీలు చేయడం అంత సులువుకాదు. నాన్ సేన బ్యాట్స్‌మన్‌కు అయితే మరి కష్టం. అయినా కూడా భారత బ్యాట్స్‌మన్‌ సేనపై సత్తాచాటారు.

టాప్‌లో కోహ్లీ

టాప్‌లో కోహ్లీ

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సేన దేశాలపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ప్రస్తుత నాన్ సేన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. సేన దేశాలపై కోహ్లీ 11 టెస్ట్ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాపై 2, ఇంగ్లండ్‌పై 2, న్యూజీలాండ్‌పై 1, ఆస్ట్రేలియాపై 6 సెంచరీలు బాదాడు. విదేశీ గడ్డపై మొత్తంగా కోహ్లీ 13 టెస్ట్ సెంచరీలు బాదాడు. కోహ్లీ టెస్టులో ఇప్పటివరకు 27 శతకాలు చేయగా.. 13 విదేశాల్లో బాదాడు. మరో 14 సెంచరీలు భారత గడ్డపై చేశాడు.

పుజారా2

పుజారా2

విరాట్ కోహ్లీ తర్వాత సేన దేశాలపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసింది నయా వాల్ చేతేశ్వర్ పుజారా. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలపై కలిపి పుజారా 5 శతకాలు చేశాడు. 4 సెంచరీలతో టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్ 3 సెంచరీలతో 4వ స్థానంలో ఉన్నాడు. టాప్-5లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్‌ ఉండడం విశేషం. 3 సెంచరీలతో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్‌ అజర్ అలీ, బంగ్లాదేశ్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ తమీమ్ ఇక్బాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Devon Conwayకి 'ఐసీసీ ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్' అవార్డు.. భారత మహిళా క్రికెటర్లకి నిరాశే!!

సచిన్1

సచిన్1

మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసింది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. సేన దేశాలపై 17 శతకాలు బాదాడు. దక్షిణాఫ్రికాపై 5, ఇంగ్లండ్‌పై 4, న్యూజీలాండ్‌పై 2, ఆస్ట్రేలియాపై 6 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. ది వాల్ రాహుల్ ద్రవిడ్ 10 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై 1, ఇంగ్లండ్‌పై 6, న్యూజీలాండ్‌పై 2, ఆస్ట్రేలియాపై 1 శతకాలు చేశాడు. బ్రియాన్ లారా 11 సెంచరీలతో మూడో స్థానంలో, కుమార్ సంగక్కర 7 శతకాలతో టాప్-5లో ఉన్నాడు. మొహ్మద్ అజారుద్దీన్, యూనిస్ ఖాన్ చెరో 5 శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

Story first published: Tuesday, July 13, 2021, 13:15 [IST]
Other articles published on Jul 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+