Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా సతీమణే నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసింది: భువీ

Bhuvneshwar Kumars wife Nupur hacked his Facebook account

న్యూఢిల్లీ: గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీ కోసం పరితపిస్తున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌తో భువనేశ్వర్ పునరాగమనం చేయాల్సి ఉండగా.. వర్షం, కరోనాతో ఆ సిరీస్ తుడిచిపెట్టుకుపోయింది.ఈ మహమ్మారి దెబ్బకు ఐపీఎల్‌తో సహా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దయ్యాయి. దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఈ స్వింగ్ కింగ్ ఫ్యామీలీతో గడుపుతున్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో సతీమణి నుపుర్ నాగర్‌‌తో కలిసి చిట్‌చాట్ చేసిన ఈ స్టార్ పేసర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నా ఫేస్‌బుక్ హ్యాక్ చేసింది..

నా ఫేస్‌బుక్ హ్యాక్ చేసింది..

తమ వివాహ బంధం గురించి చెబుతూ.. ఒకసారి నుపుర్ నాగర్ తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసిందని, అప్పటి నుంచి వాడటమేలేదని చెప్పుకొచ్చాడు. ‘నుపుర్ ఒకరోజు నా ఫేస్‌బుక్ ప్రోఫైల్ పాస్‌వర్డ్ అడిగింది. నేను చెప్పలేదు. మరుసటి రోజు వచ్చి ఇదే నీ ఫేస్‌బుక్ కొత్త పాస్‌వర్డ్ అని తెలిపింది. తను నా ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసింది. దీంతో అవాక్కైన నేను అప్పటి నుంచి ఫేస్‌బుక్ వాడటమే మానేశాను.'అని తెలిపాడు.

నా 13 ఏళ్ల వయసులో భువీని కలిసా..

నా 13 ఏళ్ల వయసులో భువీని కలిసా..

ఇక నుపుర్ కూడా తమ ప్రేమ వ్యవహారాలు, ఫస్ట్ కలిసినప్పటి క్షణాలను నెమరు వేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 13 ఏళ్ల వయసులో భువనేశ్వర్‌ను తొలిసారి కలిశానని తెలిపింది. ఇక అప్పటి నుంచి తమ మధ్య ప్రేమ చిగురించిందని తెలిపింది. ఈ విషయం భువీ కూడా ఒప్పుకున్నాడు.

అదే నా ఫేవరేట్ స్పెల్..

అదే నా ఫేవరేట్ స్పెల్..

పాకిస్థాన్‌తో 2012లో జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ వేసిన స్పెల్ తన పేవరేట్ అని నుపూర్ తెలిపింది. ‘పాకిస్థాన్‌పై భువీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు నేను మా స్నేహితులతో హాస్టల్‌లో ఉన్నా. భువీ నా లవర్ అనే విషయం వారికి తెలియదు. అతని బౌలింగ్‌ వారిని చాలా ఇంప్రెస్ చేసింది. ఆ 15 నెంబర్ జెర్సీ ఆటగాడు బాగా బౌలింగ్ చేస్తుండు అని వారంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. 'అని నుపూర్ తన ఫెవరేట్ స్పెల్ గురించి చెప్పుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

2017లో వివాహం..

2017లో వివాహం..

ఇక భువనేశ్వర్, నుపుర్‌ నాగర్‌‌ల వివాహం 2017 నవంబర్ 23న జరిగిన విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన నుపుర్.. భువీ ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో చిన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది.

Story first published: Sunday, March 22, 2020, 10:49 [IST]
Other articles published on Mar 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+