Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సిక్స్‌‌‌‌ను మర్చిపోను.. నా సక్సెస్ క్రెడిట్ ఆ ఇద్దరిదే: భువనేశ్వర్ కుమార్

క్లిష్ట పరిస్థితుల్లో సిక్స్ బాది జట్టుకు విజయాన్ని అందించడాన్ని ఎప్పటికీ మర్చిపోనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఈ సిక్స్ తాను తీసిన 4 వికెట్ల కంటే ఎక్కవ అని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.

చివరి 3 బంతుల్లో ఆర్‌సీబీ విజయానికి 9 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ తొలి బంతినే సిక్సర్ బాది చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో 4 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. ఈ విజయం తమకు చాలా ముఖ్యమని, ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే తమపై తీవ్ర ఒత్తిడి ఉండేదని తెలిపాడు.

Bhuvneshwar Kumar Credits Personal Staff for Success Relishes Crucial Six against MI in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

హోస్ట్: ఈరోజు మ్యాచ్‌లో మీరు దేనిని గుర్తుంచుకుంటారు?

భువనేశ్వర్ కుమార్: ఖచ్చితంగా నేను కొట్టిన ఆ సిక్స్‌నే. ఎందుకంటే నేను చాలాసార్లు అద్భుతంగా బౌలింగ్ చేశాను. కీలక వికెట్లు కూడా తీశాను. కానీ, ఈ రోజు జట్టు విజయానికి కావాల్సిన సిక్స్‌ను కొట్టడం అత్యధికంగా ఆస్వాదించాను.

హోస్ట్: ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి లభిస్తుంది?

భువనేశ్వర్ కుమార్: నిజాయితీగా చెప్పాలంటే.. 'మోటివేషన్' అనేది నా దృష్టిలో చాలా అతిగా అంచనా వేసే పదం. మీరు ఏదైనా కోట్ చదివినా లేదా ఏదైనా ఇన్స్పిరేషన్ వీడియో చూసినా దాని ప్రభావం కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ మోటివేషన్ అనే పదాన్ని నేను పట్టించుకోను.

నన్ను ముందుకు నడిపించేది కేవలం నా క్రమశిక్షణ మాత్రమే. అలాగే, జట్టుతో పాటు ఫిజియోలు, ట్రైనర్లు ఉన్నప్పటికీ.. నాకు వ్యక్తిగతంగా ఇంట్లో కూడా ఒక ఫిజియో, ట్రైనర్ ఉన్నారు. వారు నాతో కలిసి చాలా కష్టపడతారు. నేను ఫిట్‌గా ఉండటానికి వారు సహాయపడతారు. కాబట్టి ఈ క్రెడిట్ వారికి కూడా దక్కుతుంది.

హోస్ట్: మీరు నిలకడగా గుడ్ లెంగ్త్‌లో ఎలా బౌలింగ్ చేస్తున్నారు?

భువనేశ్వర్ కుమార్: అంతా పిచ్, మ్యాచ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు పిచ్‌లో సహకారం ఉంది కాబట్టి లెంగ్త్ బాల్ వేసినప్పుడు ఫలితం లభించింది. కొన్నిసార్లు ఫ్లాట్ వికెట్లు ఉంటాయి. అక్కడ లెంగ్త్ బాల్ వేసినా ఉపయోగం ఉండదు. అప్పుడు కండిషన్స్‌కు తగ్గట్లు కొత్తగా ప్రయత్నించాలి. పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటామనేదే కీలకం.

హోస్ట్: ఐపీఎల్ తర్వాత మీ దినచర్య ఎలా ఉంటుంది?

భువనేశ్వర్ కుమార్: మంచి విషయం ఏంటంటే.. ఏడాది పొడవునా నేను ఆటకు దూరమవ్వకుండా తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ పొందుతున్నాను. అలాగే నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడానికి, బలాన్ని పుంజుకోవడానికి తగినంత విరామం కూడా లభిస్తోంది. నేను యూపీ టీ20 (UPT20), ముస్తాక్ అలీ టోర్నీలు ఆడుతున్నాను. ఈ రెండు టోర్నీలు నా బౌలింగ్ లయ తప్పకుండా ఉండేందుకు సహకరిస్తున్నాయి.

ఐపీఎల్ స్థాయి ముస్తాక్ అలీ, యూపీ టీ20 కంటే భిన్నంగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాకు ఆర్‌సీబీ టీమ్ క్యాంప్ ఉంటుంది. అక్కడ నాకు అవసరమైన ప్రాక్టీస్ లభిస్తోంది.

హోస్ట్: బౌలింగ్ మీరు అనుకున్నట్లుగా సాగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?

భువనేశ్వర్ కుమార్: ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ సాగితే.. అది నాకు అత్యుత్తమ అనుభూతినిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా టీమ్‌మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పుడు మరింత సంతోషం కలుగుతోంది.

హోస్ట్: ఇది మీ జట్టుకు ప్రత్యేకమైన ప్రదర్శన కదా..?

భువనేశ్వర్ కుమార్: అవును. ఈ మ్యాచ్ గెలవడం మాకు కీలకం. ఎందుకంటే మాకు ఇవి చాలా కీలకమైన రెండు పాయింట్లు. ఒకవేళ మేం ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. ఖచ్చితంగా ఒత్తిడిలో ఉండేవాళ్లం. కానీ ఆ పాయింట్లు సాధించడానికి మేం బాగా ఆడాం.'అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, May 11, 2026, 10:53 [IST]
Other articles published on May 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+